Tata Motors: అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం కారణంగా ముడి సరుకుల రేట్లు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఈ ప్రభావం వాహన తయారీ రంగాన్ని కూడా తాకింది. దీంతో దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ సంచలన నిర్ణయం తీసుకుంది.
టాటా మోటార్స్ మే 1, 2023 నుంచి తమ ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచుతున్నట్లు వెల్లడించింది. నియంత్రణ మార్పులు, పెరిగిన ఖర్చులను దీనికి కారణంగా కంపెనీ చెబుతోంది. తయారీ ఖర్చులు పెరుగుతున్న తరుణంలో వాటిలో కొంత భాగాన్ని వినియోగదారులకు బదిలీ చేసేందుకు రేట్ల పెంపును ఆశ్రయించింది. దీంతో కొత్త ఆర్థిక సంవత్సరం కార్లు కొనాలనుకునేవారికి కొత్త షాక్ తప్పదని చెప్పుకోవాలి.

వేరియంట్, మోడల్ ఆధారంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల ధరల్లో సగటు పెరుగుదల 0.6 శాతంగా ఉంటుందని తెలిపింది. ఈ స్వల్ప పెరుగుదల.. తయారీలో పెరుగుతున్న ఖర్చులు, దాని వినియోగదారులకు అధిక-నాణ్యత గల వాహనాలను అందించడానికి టాటాల నిబద్ధత మధ్య సమతుల్యతను కొనసాగించే ప్రయత్నమని కంపెనీ వెల్లడించింది.
ప్రస్తుత తరుణంలో వాహనాల ధరలను పెంచాలని నిర్ణయించిన కార్ల తయారీ సంస్థ కేవలం టాటా మోటార్స్ ఒక్కటి మాత్రమే కాదు. ఇతర పోటీదారుపైన మారుతి, హ్యుందాయ్, హోండా వంటి ఇతర ప్రధాన కార్ల తయారీదారులు కూడా దేశంలో తమ కార్ల ధరలను పెంచాలని నిర్ణయించాయి. కారు మోడల్‌ను బట్టి రూ.2,000 నుంచి రూ.15,000 వరకు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి.


Click it and Unblock the Notifications