Tata Motors: అంచనాలకు మించి లాభాలతో మతిపోగొట్టిన టాటా మోటార్స్.. ఇక షేర్ దూకుడే..
Tata Motors Q1 Results: టాటా గ్రూప్ కంపెనీల్లో ఒకటైన టాటా మోటార్స్ జూన్ తో ముగిసిన త్రైమాసికంలో సూపర్ లాభాలను నమోదు చేసింది. మార్కెట్ లెక్కలను తలదన్నుతూ, ఎంచనాలకు మించిన పనితీరును కనబరిచింది.
మంగళవారం విడుదలైన ఫలితాల ప్రకారం టాటా మోటార్స్ నికల లాభం రూ.3,203 కోట్లుగా నమోదైంది. అయితే మార్కెట్లోని బ్రోకరేజ్ సంస్థలు ఈ త్రైమాసికంలో రూ.2,600 లాభాన్ని కంపెనీ అందుకుంటుందని అంచనా వేశారు. జాక్వార్ ల్యాండ్ రోవర్ అందించిన దన్నుతో కంపెనీ లాభాలు స్టేక్ హోల్డర్ల అంచనాలను దాటేశాయి. ఈ కాలంలో కార్యకలాపాల ద్వారా ఆదాయం 42 శాతం పెరిగి రూ.1.02 కోట్లకు చేరుకోవటం గమనార్హం.

బలమైన లాభాలకు ప్యాసింజర్ వాహన వ్యాపారం, లగ్జరీ కార్ యూనిట్ జాగ్వార్ ల్యాండ్ రోవర్(JLR) వద్ద అమ్మకాల వృద్ధి ప్రధాన కారణంగా కంపెనీ తెలిపింది. గత ఏడాది ఇదే త్రైమాసిక సమయంలో టాటా మోటార్స్ రూ.5,006.60 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేయగా.. రూ.71,934.66 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. అయితే FY24 మొదటి త్రైమాసికంలో 3,22,159 వాహనాలను విక్రయించింది. అందులో ప్రయాణీకుల వాహనాల విక్రయాలు ఏడాదికి 8 శాతం పెరిగి 140,450 యూనిట్లకు చేరుకున్నాయి.
ఇదే సమయంలో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల్లో సైతం కంపెనీ దూసుకుపోతోంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రజలు సైతం ఈవీల వైపు మెుగ్గుచూపటంతో ఈ వ్యాపారంలో సైతం టాటా మోటార్స్ వేగంగా వృద్ధిని సాధిస్తోంది. తాజా త్రైమాసికంలో జాగ్వార్ 10,324 యూనిట్లను, ల్యాండ్ రోవర్ 82,929 వాహనాలను విక్రయించాయి. ఈ మెుత్తం అమ్మకాల సంఖ్య గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే 30 శాతం అధికం. కంపెనీ లాభాలపై పాజిటివ్ అంచనాల దృష్ట్యా మార్కెట్ క్లోజింగ్ నాటికి టాటా మోటార్స్ స్టాక్ ఎన్ఎస్ఈలో 2 శాతం లాభపడి రూ.641.80 వద్ద ముగిసింది. రేపు మార్కెట్లో స్టాక్ మరింతగా లాభపడొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications