భారత ఆటో దిగ్గజం టాటా మోటార్స్ అరుదైన ఘనత సాధించింది. ఈ కంపెనీ పాసింజర్ వాహనాల ఉత్పత్తి సామర్థ్యం భారత దేశంలో 40 లక్షలను దాటింది. ఈ కంపెనీ పాసింజర్ వాహన విభాగంలో తొలి మోడల్‌ను విడుదల చేసిన మూడు దశాబ్దాల తర్వాత ఈ మైలురాయిని అందుకుంది. 1991లో టాటా సియెరా SUVని విడుదల చేసింది. ఆ రోజు టాటా మోటార్స్ పాసింజర్ వెహికిల్ సేల్స్ విభాగంలోకి అడుగిడింది. 30 సంవత్సరాల్లో ఈ కంపెనీ ఎన్నో రకాల మోడల్స్‌ను విడుదల చేసి, కస్టమర్లను ఆకట్టుకుంది.

3 దశాబ్దాల్లో ఎన్నో మోడల్స్
టాటా ఇండికా, టాటా సియెరా, టాటా సుమో, టాటా సఫారీ, నానా వంటి వివిధ మోడల్స్‌ను విడుదల చేసింది. ముప్పై ఏళ్ల క్రితం పాసింజర్ వెహికిల్స్ సేల్స్ విభాగంలోకి అడుగుపెట్టిన టాటా మోటార్స్ 2005-06లో పది లక్షల ఉత్పత్తి మార్కును చేరుకుంది. ఆ తర్వాత పదేళ్లకు అంటే 2015లో 30 లక్షలకు చేరుకుంది. ఇప్పుడు మరో అయిదేళ్ల తర్వాత 40 లక్షల మైలురాయిని అందుకుంది. మొదటి పది లక్షలు చేరుకోవడానికి 15 సంవత్సరాలు తీసుకోగా, చివరి పది లక్షలకు ఐదేళ్లు తీసుకుంది.

ఇది మరో మైలురాయి
టాటా మోటార్స్‌కు ఇది మైలురాయి అని, ఆటోమొబైల్ పరిశ్రమలో కొన్ని సంస్థలు మాత్రమే ఈ మార్కును చేరుకుంటాయని కంపెనీ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్) శైలేష్ చంద్ర అన్నారు. 1991లో టాటా సియెరాతో మొదలైన తమ వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. సియెరా, ఎస్టేట్, సఫారీ, ఇండికా, నానో వంటి మోడల్స్‌ను తొలిసారి మార్కెట్లోకి తెచ్చామన్నారు.

సియెరాతో...
సియెరాతో ఈ కంపెనీ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. సఫారీతో మరింత సంఘటితం చేసింది. సుంత్ మూల్గాంకర్ గౌరవసూచంగా టాటా మోటార్స్ ఆ తర్వాత మొదటి మల్టీ పర్పస్ వెహికిల్ టాటా సుమోను ప్రారంభించింది. ఆ తర్వాత టాటా ఇండికాతో కస్టమర్ పెర్సెప్షన్‌ను మార్చింది. టాటా మోటార్స్ కంపెనీ 1998లో పీవీబీయూ రాగా, ఇండికాను మొదటిసారి ఉత్పత్తి చేసింది. ఈ కంపెనీ ఎస్‌యూవీ నెక్సాన్ గ్లోబల్ ఎన్‌క్యాప్ నుండి 5స్టార్ రేటింగ్ అందుకుంది. దీనిని అందుకున్న తొలి భారత మోడల్ ఇది.


Click it and Unblock the Notifications