Tata Cars: టాటా కార్లపై భారీ ఆఫర్లు.. రూ.3.35 లక్షల వరకు తగ్గింపు..!

భారతీయ ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన వాహనాలపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లు, ఎస్యూవీ కార్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఆ కంపెనీ నుంచి ఇటీవల విడుదలైన సియెర్రా ఈవీ మినహా కర్వ్ ఈవీ, హరియర్ ఈవీ, నెక్సాన్ ఈవీ, టియగో ఈవీ, మోడళ్లపై రూ.3.35 లక్షల వరకు తగ్గింపులు పొందే అవకాశం కల్పించింది. ఆఫర్లలో గ్రీన్ బోనస్, ఎక్స్చేంజ్ ఆఫర్లు, స్క్రాపేజ్, లాయాల్టీ రిబేట్ రూపంలో తగ్గింపులు పొందే అవకాశం ఉంది. 2026 జూలైలో టాటా ఎలక్ట్రిక్ కార్లపై ఆఫర్లు గురించి తెలుసుకుందాం.

tata Motors

టాటా కర్వ్ 'X' వేరియంట్ మినహా మిగిలిన అన్ని వేరియంట్లపై అత్యధికంగా రూ. 3.35 లక్షల ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో రూ. 3 లక్షల విలువైన భారీ గ్రీన్ బోనస్ (ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్) కూడా ఉంది. క్రియేటివ్ గ్రేడ్ వేరియంట్‌పై రూ. 2.85 లక్షల వరకు తక్కువ తగ్గింపు లభించనుంది. అదే సమయంలో కర్వ్ ఈ ఎక్స్ వేరియంట్‌పై ఎటువంటి నగదు తగ్గింపు లేకుండా కేవలం రూ. 65,000 ప్రయోజనాలు ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్, లాయల్టీ ద్వారా రానున్నాయి.

టాటా ఎలక్ట్రిక్ SUV అయిన హరియర్ ఈవీపై రూ. 2.75 లక్షల వరకు తగ్గింపులు లభిస్తాయి. ఇందులో రూ. 50,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ. 75,000 స్క్రాపేజ్ ప్రయోజనాలు, అలాగే లాయల్టీ బోనస్, ప్రత్యేక మద్దతు కింద ఒక్కొక్కదానికి రూ. 1 లక్ష చొప్పున ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పటివరకు టాటా నుంచి అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ SUV అయిన నెక్సాన్ ఈవీపైకనీసం రూ. 50,000 ప్రయోజనాలు లభించనున్నాయి. ఇందులో అన్ని వేరియంట్లపై రూ. 15,000 ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్ కూడా ఉంది.

టాటా కర్వ్ ఈవీ క్రియేటివ్ పై రూ.2.85 లక్షలు, కర్వ్ ఈవీ ఎక్స్ రూ.65,000, కర్వ్ ఈవీ పై రూ.3,35 లక్షలు, టాటా హరియర్ ఈవీ పై రూ.2.75 లక్షలు, టాటా నెక్సాన్ ఈవీ రూ.50,000, టాటా టియాగో ఈవీ ఎల్ఆర్ఎక్స్టీ పై రూ.1.45 లక్షలు, టాటా టియాగో ఈవీ ఎల్ఆర్ ఎక్స్జెడ్ ప్లస్ పై రూ.1.25 లక్షలు, టాటా టియాగో ఈవీ ఎంఆర్ పై రూ.65,000, టాటా పంచ్ ఈవీ ఎల్ఆర్ పై రూ.1.45 లక్షలు, టాటా పంచ్ ఈవీ ఎంఆర్ స్మార్ట్ అండ్ స్మార్ట్ ప్లస్ పై రూ.95,000, టాటా పంచ్ ఈవీ ఎంఆర్ పై రూ.1.25 లక్షలు తగ్గింపు ఉండనుంది. ఇటీవల భారతీయ మార్కెట్‌లో 2026 Tata Tiago EV విడుదలైంది.

పాత స్టాక్‌ను క్లియర్ చేయడానికి, వేరియంట్‌ను బట్టి రూ. 65,000 నుంచి రూ. 1,45,000 వరకు తగ్గింపులతో పాత మోడల్ అందుబాటులో ఉంది.లాంగ్ రేంజ్ ఎక్స్ టీ వేరియంట్‌పై రూ. 1.45 లక్షల విలువైన ప్రయోజనాలు లభిస్తుండగా, స్మార్ట్, మీడియం రేంజ్ వేరియంట్లపై రూ. 1.25 లక్షల వరకు తగ్గింపులు లభిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+