హైదరాబాద్: భారత ఆటో దిగ్గజం టాటా మోటార్స్ ఉద్యోగులకు వాలంటరీ రిటైర్మెంట్ స్కీ(VRS)ను ఆఫర్ చేసింది. కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు తొమ్మిది నెలలుగా సేల్స్, ఉత్పత్తి పడిపోయాయి. ఇటీవలే కార్యకలాపాలు తిరిగి పుంజుకుంటున్నాయి. కరోనా ప్రభావం ఆటో రంగంపై కూడా తీవ్రంగానే పడింది. అమ్మకాలు లేక ఆదాయాలు క్షీణించి ఇబ్బందులు పడుతున్న టాటా మోటార్స్ టర్నరౌండ్ ప్లాన్, ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా 42,597 మంది ఉద్యోగులకు వీఆర్ఎస్ ఆఫర్ ఇచ్చింది.

4 ఏళ్లలో మూడోసారి
టాటా మోటార్స్ వీఆర్ఎస్ స్కీంను ఆఫర్ చేయడం గత నాలుగేళ్లలో మూడోది. ఈ వీఆర్ఎస్ స్కీం ద్వారా స్థిర వ్యయ నిర్మాణాలకు సంబంధించిన ఖర్చులు తగ్గుతాయని కంపెనీ భావిస్తోంది. ఈ మేరకు వీఆర్ఎస్ పథకం గురించి శుక్రవారం తెలిపింది. కంపెనీ ఉద్యోగుల్లో దాదాపు సగం మంది ప్రస్తుత వీఆర్ఎస్ పథకానికి అర్హులు అని టాటా మోటార్స్ వెల్లడించింది. 2019 నవంబర్ నెలలో పాసింజర్ వెహికిల్స్, కమర్షియల్ వెహికిల్ బిజినెస్‌లోని ఉద్యోగుల్లో 1600 మందికి వీఆర్ఎస్ ఇచ్చింది.

వీఆర్ఎస్ అర్హులు
తాజా వీఆర్ఎస్ స్కీం ప్రకారం అయిదేళ్లు లేదా అంతకంటే ఎక్కువకాలం సంస్థలో పని చేసినవారు ఈ పథకానికి అర్హులు. ఉద్యోగి వయస్సు, సంస్థలో వారి సేవల ఆధారంగా పరిహారాన్ని లెక్కిస్తారు. అర్హత కలిగిన ఉద్యోగులు డిసెంబర్ 11వ తేదీ నుండి 2021 జనవరి 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీఆర్ఎస్‌ను ఎంతమంది ఉద్యోగులు ఎంచుకుంటున్నారనే అంశం రాబోయే రోజుల్లో తెలియనుంది. ఉద్యోగుల సంక్షేమం పట్ల నిబద్దతను నిర్ధారిస్తూ కంపెనీ తన టర్నరౌండ్ ప్రణాళికను విజయవంతంగా అమలు చేస్తోందని టాటా మోటార్స్ తెలిపింది.

ఖర్చులు తగ్గించుకునే దిశగా ఆటో
టాటా మోటార్స్ గత నాలుగేళ్లుగా ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధానంగా ఉద్యోగుల వ్యయాన్ని తగ్గిస్తోంది. 2017లో ఆఫర్ ఇచ్చింది. అయితే చాలామంది ఉద్యోగులు అప్పుడు ఈ వీఆర్ఎస్ స్కీంకు మొగ్గు చూపలేదు. 2019లో కరోనా, 2020లో కరోనా కారణంగా ఆటో పరిశ్రమ దెబ్బతిన్నది. ఈ సమయంలోను టాటా మోటార్స్ వీఆర్ఎస్ ప్రకటించింది. హీరో మోటో కార్ప్, టయోటా కిర్లోస్కర్ ప్రయివేట్ లిమిటెడ్, అశోకే లేలాండ్ వంటి ఆటో దిగ్గజాలు కూడా ఇలాంటి స్కీమ్స్ ప్రకటించాయి.
More From GoodReturns

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications