Tata Motors: డోన్ట్‌మిస్.. టాటా మోటార్స్ మెగా ఆఫర్స్.. ఆ మోడల్ కార్లపై రూ.3 లక్షలు డిస్కౌంట్స్..
Tata Motors Price Cut: దేశీయ టాప్ ఆటో దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ పండుగ బహుమతిని సిద్ధం చేసింది. కొత్తగా కారు కొనాలనుకుంటున్న వాహన ప్రియులకు భారీ తగ్గింపులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ క్రమంలో టాటా మోటార్స్ ఎంపిక చేసిన మోడళ్లపై కస్టమర్లకు రూ.3 లక్షల వరకు భారీ తగ్గింపును ప్రకటించింది. కంపెనీ తన 'ఫెస్టివల్ ఆఫ్ కార్స్' ప్రచారంలో ఎలక్ట్రిక్ వాహన మోడళ్లపై ధరల తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఆఫర్ కింద టాటా టియాగో, టాటా పంచ్, టాటా నెక్సాన్ మోడళ్లు తగ్గింపులను అందిస్తున్నాయి. ప్రకటన ప్రకారం టాటా పంచ్ EV ధర ఇప్పుడు రూ.7.99 లక్షల నుంచి రూ.9.99 లక్షలుగా ఉండనుంది. అలాగే నెక్సాన్ ఈవీ ధరలు రూ.12.49 లక్షల నుంచి ప్రారంభమౌతాయి. ఈవీల స్వీకరణను పెంచే లక్ష్యంతో ధరల తగ్గుదల ప్రకటించబడిందని కంపెనీ వెల్లడించింది.

ఈవీల ధరలను తగ్గించడతో పాటు టాటా మోటార్స్ మరో ఆఫర్ కూడా ప్రకటించింది. దీని కింద దేశవ్యాప్తంగా 5,500 కంటే ఎక్కువ టాటా పవర్ ఛార్జింగ్ పాయింట్లలో 6 నెలల పాటు ఉచిత ఛార్జింగ్ సౌకర్యాన్ని సైతం టాటా మోటార్స్ ఆఫర్ చేస్తోంది. కస్టమర్లకు ఇంటర్-సిటీ, ఇంట్రా-సిటీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా ఇది మారుస్తుందని కంపెనీ పేర్కొంది. సాధారణ కార్ కొనుగోలుదారులకు EVలను మరింత అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యమని టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవత్స అన్నారు. అలాగే కంపెనీ ICE వేరియంట్‌లపై డిస్కౌంట్లను కూడా ప్రకటించింది. సెప్టెంబరు 9న వివిధ ICE మోడళ్లపై రూ.2.05 లక్షల వరకు తగ్గింపులను ప్రకటించింది.
వివిధ కార్ మోడళ్లపై ఆఫర్ చేస్తున్న తగ్గింపులు
టియాగో రూ. 65,000
టిగోర్ రూ. 30,000
ఆల్ట్రోజ్ రూ. 45,000
నెక్సాన్ రూ.80,000
హరియర్ రూ.1,60,000
సఫారీ రూ.1,80,000
టాటా మోటార్స్ ఇప్పటికే ఉన్న ఈవీ మోడళ్లకు తోడు కొత్త వాటికి మార్కెట్లోకి తెచ్చే పనిలో ఉంది. ఈ క్రమంలోనే టాటా మోటార్స్ తన టాటా కర్వ్ EVని ఆగస్టులో రూ.17.5 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ నెల ప్రారంభంలో ప్రారంభించిన ICE వేరియంట్ ప్రారంభ ధర రూ.9.99 లక్షలుగా ఉంచింది. దేశంలో సరసమైన ధరలకు ఈవీలను అందుబాటులోకి తెచ్చే ప్రణాళికలతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అలాగే రానున్న పండుగ సీజన్లో కొత్త కార్ల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు కంపెనీ ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటించింది.


Click it and Unblock the Notifications