Tata Punch: నెక్స్ట్ లెవెల్ మైక్రో ఎస్‌యూవీ మార్కెట్లో రిలీజ్: ధర, ఫీచర్లు ఇవే

న్యూఢిల్లీ: దేశీయ టాప్ కార్ మేకర్స్ టాటా మోటార్స్.. తన నెక్స్ట్ లెవెల్ మైక్రో ఎస్‌యూవీ కారును కొద్దిసేపటి కిందటే దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. కారు మోడల్‌ను ఆవిష్కరించింది. ఈ మైక్రో ఎస్‌యూవీ కార్ల సెగ్మెంట్‌లో ఉన్న మార్కెట్‌ను ఆకట్టుకోవడానికి టాటా మోటార్స్ దీన్ని డిజైన్ చేసింది. మారుతి సుజుకి ఇగ్నీస్, మహీంద్రా కేయూవీ-100, నిస్సాన్ మాగ్నైట్, రెనో కైగర్ వంటి మోడళ్లకు కాంపిటీట్ చేసేలా టాటా మోటార్స్ ఈ పంచ్ మోడల్ కారును మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ సెగ్మెంట్‌లో పోటీకి తెర తీసినట్టయింది.

ధర ఎంత?

ధర ఎంత?

కొత్త ఎస్‌యూవీ పంచ్ కారు బేసిక్ ప్రైస్ 5.49 లక్షల రూపాయలు. ఇది ఎక్స్ షోరూమ్ ధర. బుకింగ్స్ కూడా ఇప్పటికే మొదలయ్యాయి. ఈ మోడల్ కారును కొనుగోలు చేయదలిచిన వారు టాటా మోటార్స్ అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ చేయడం ద్వారా కారును బుక్ చేసుకోవచ్చు. లేదా అధికారిక డీలర్‌ను సంప్రదించవచ్చు. కారు బుకింగ్ కోసం 21,000 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. బుకింగ్స్ ఆరంభం కావడంతో.. మంచి డిమాండ్ లభిస్తోందని టాటా మోటార్స్ చెబుతోంది.

ఎన్ని వేరియంట్లు..?

ఎన్ని వేరియంట్లు..?

టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీ కారును మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది టాటా మోటార్స్ మేనేజ్‌మెంట్. ప్యూర్, అడ్వెంచర్, అకంప్లైస్డ్, క్రియేటివ్‌..ఈ నాలుగు వేరియంట్లలో ఈ కారు మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ప్యూర్ అనే వేరియంట్ కాకుండా మిగిలిన మూడు కూడా మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌ (ఎఎంటీ)లో లభిస్తాయి. ప్యూర్ వేరియంట్‌లో ఎఎంటీ అందుబాటులో లేదు. మ్యానువల్ ట్రాన్స్‌మిషన్ మోడల్‌లోనే లభిస్తుంది ఇది.

వేరియంట్స్ ప్రకారం రేటు ఎలా ఉంది?

వేరియంట్స్ ప్రకారం రేటు ఎలా ఉంది?

ఒక్కో వేరియంట్ కోసం ఒక్కో రేటును నిర్ధారించింది టాటా మోటార్స్. మ్యానువల్‌లో లభించే అడ్వెంచర్ వేరియంట్ ధర 6,39,000, అకంప్లైష్డ్-7,29,000, క్రియేటివ్ వేరియంట్ ధర-8,49,000 రూపాయలుగా నిర్ధారించింది. మొత్తం టాటా పంచ్ ఏడు రంగుల్లో లభిస్తాయి ఈ మోడల్ కార్లు. టోర్నెడో బ్లూ, కాలిప్సో రెడ్, మెటోర్ బ్రాంజ్, అటామిక్ ఆరెంజ్, ట్రాపికల్ మిస్ట్, డేటోనా గ్రే, ఆర్కస్ వైట్‌ కలర్లలో ఈ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది టాటా మోటార్స్.

వేరియంట్ల వారీగా కలర్స్

వేరియంట్ల వారీగా కలర్స్

ఇందులో కూడా వేరియంట్ల వారీగా కలర్స్‌ ఉన్నాయి. ప్యూర్ వేరియంట్.. తెలుపు, గ్రే రంగులో మాత్రమే లభిస్తుంది. అడ్వెంచర్ వేరియంట్-వైట్, గ్రే, ఆరెంజ్, మిస్ట్ కలర్‌లో దొరుకుతుంది. అకంప్లైష్డ్‌లో వైట్, గ్రే, ఆరెంజ్, మిస్ట్, బ్రాంజ్ రంగులు ఉన్నాయి. క్రియేటివ్‌ వేరియంట్‌లో బ్లూ, రెడ్, బ్రాంజ్, ఆరెంజ్, మిస్ట్, గ్రే, వైట్ అందుబాటులో ఉంటాయి. ఈ మైక్రో ఎస్‌యూవీ పంచ్ కారు.. పెట్రోల్ వేరియంట్‌. 1.2 రెవొట్రాన్ ఇంజిన్‌ను వినియోగించారు. 1199 సీసీ సిలిండర్లు ఉంటాయి. రివాల్యూషన్ పర్ మినిట్ 6000.

బాడీ బిల్డింగ్ ఎలా ఉంది?

బాడీ బిల్డింగ్ ఎలా ఉంది?

టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీ ఎక్స‌టీరియర్ చూస్తే- బాడీని అత్యాధునికమైన ఎజైల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్‌డ్‌ డిజైన్ చేశారు. పొడవు 3,827, వెడల్పు 1,742, ఎత్తు1,615 మిల్లీ మీటర్లు ఉంటుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 187 మిల్లీమీటర్లు. ఇంటీరియర్‌లో ఆటోమేటిక్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రెయిన్-సెన్సింగ్ వైపర్స్, రియర్ వైపర్, 16-ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉందీ మోడల్. డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్, 90 డిగ్రీ ఓపెనింగ్ డోర్స్, రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ ఉన్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+