Tata Motors: టాటా మోటర్స్ పెద్ద మనస్సు.. వారికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం..!
ఆర్థిక మాంద్యం భయాలతోపాటు, ఖర్చును తగ్గించుకోవడానికి అనేక ఐటీ సంస్థలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలైన మెటా, అమెజాన్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల తొలిగింపు ప్రక్రియ చేపట్టింది. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్-మద్దతుగల జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) UK, ఐర్లాండ్, USA, భారతదేశం, చైనా, హంగేరీలో 800 కంటే ఎక్కువ కొత్త డిజిటల్, ఇంజనీరింగ్ ఖాళీలను భర్తీ చేయడానికి నియామక ప్రణాళికను శుక్రవారం ప్రకటించింది. JLR సంస్థ డిజిటల్-ఫస్ట్, డేటా-ఆధారిత సంస్థగా మారినందున డిజిటల్ టెక్నాలజీ పరిశ్రమ నుంచి నైపుణ్యం కలిగిన వారిని రిక్రూట్ చేయడానికి ప్రయత్నిస్తుంది.
డిజిటల్ సేవలు
విద్యుదీకరణ, డిజిటల్ సేవలు, డేటాపై దృష్టి సారించి వేగంగా మారుతున్న ఆటోమోటివ్ పరిశ్రమలో JLR ముందంజలో ఉంది. JLR దాని అంతర్గత డేటా సామర్థ్యాన్ని పెంపొందించడంపై దృష్టి సారించింది. మెరికాలోని అనేక పెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించడం ప్రారంభించాయి. ట్విట్టర్, ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా వంటి చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించడం ప్రారంభించాయి. దీంతో ప్రజలకు ఉపాధి కష్టాలు మొదలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ దిగ్గజం టాటా ఇంత పెద్ద కంపెనీల ఉద్యోగులకు ఆపన్న హస్తం అందించడంపై ఆ సంస్థపై ప్రశంసలు కురుస్తున్నాయి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
JLRలో అటానమస్ డ్రైవింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిఫికేషన్, క్లౌడ్ సాఫ్ట్‌వేర్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ మరియు మరెన్నో పాత్రల కోసం గ్లోబల్ హైరింగ్ అందుబాటులో ఉంటుంది. "మేము మా డేటా, డిజిటల్ స్కిల్స్ బేస్‌ను మరింత బలోపేతం చేస్తున్నాము, తద్వారా మేము మా రీమాజిన్ వ్యూహాన్ని అందించగలము. 2025 నుంచి ఎలక్ట్రిక్-ఫస్ట్ బిజినెస్‌గా మారవచ్చు. 2039 నాటికి కార్బన్ నెట్ జీరోను సాధించగలము" అని JLR చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఆంథోనీ బాటిల్ అన్నారు.


Click it and Unblock the Notifications