Q4 Results: టాటా మెటార్స్ రిజల్ట్స్‌తో ఆటోమోటివ్ సెక్టార్ షేక్.. రెట్టించిన ఉత్సాహంతో ఏడాది ముగింపు
Tata Motors: మార్కెట్లో లిస్ట్ కాబడిన ఒక్కో కంపెనీ తన Q4 త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తోంది. ఇప్పటికే పలు సంస్థలు సత్తా చాటగా, కొన్ని చతికిలపడ్డాయి. ఈ క్రమంలో ఆటోమోటివ్ సెక్టార్‌లో రారాజుగా వెలుగొందుతున్న టాటా మోటార్స్ వంతు వచ్చింది.
మార్చి 31, 2024తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను టాటా మోటార్స్ లిమిటెడ్ శుక్రవారం విడుదల చేసింది. కంపెనీ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ద్వారా వివరాలను వెల్లడించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో పెద్ద మొత్తం ఆదాయాన్ని నివేదించింది. మెరుగైన నిర్వహణ, కమొడిటీ ధరలు, వివిధ విభాగాల్లో బలమైన వాల్యూమ్ వృద్ధి కారణంగా ఏకీకృత నికర లాభం 17 వేల 407 కోట్లకు చేరుకుంది. గతేడాది PAT 5 వేల 407 కోట్లతో పోలిస్తే 222 శాతం వృద్ధిని కనబరిచింది.

సదరు త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం 13 శాతం పెరిగి లక్షా 19 వేల 986 కోట్లకు చేరుకుంది. నాలుగో త్రైమాసికంలో లాభం 7 వేల కోట్లకు పెరుగుతుందన్న బ్రోకింగ్ సంస్థల అంచనాలను తలక్రిందులు చేస్తూ దూసుకుపోయింది. ఏకంగా 33 శాతం అధిక వృద్ధిని సాధించింది. ఇక కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం ఏడాదికి 15 శాతం పెరిగి లక్షా 22 వేల కోట్లుకు ఎగబాకాయి.
మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను టాటా మోటార్స్ నికర లాభం 37 వేల 764 కోట్లుగా కంపెనీ పేర్కొంది. FY23లో నివేదించబడిన 479 కోట్ల నుంచి గణనీయమైన వృద్ధి రేటుతో మంచి దూకుడు కనబరిచింది. 2023లో 69 వేల 599 యూనిట్లను సేల్ చేయగా 2024 ఏప్రిల్ నాటికి టోకు సేల్స్ 11.5 శాతం పెరిగి 77 వేల 521ని టచ్ చేశాయి. దీంతో ఒక్కో షేరుకు 6 చొప్పున తుది డివిడెండ్‌ను సిఫార్సు చేసింది.


Click it and Unblock the Notifications