Tata Motors: దేశంలోని అతిపెద్ద స్వదేశీ వాహన తయారీదారుల్లో టాటా మోటార్స్ ఒకటి. ప్రైవేట్ కొనుగోలుదారులు మరియు వాణిజ్య సంస్థలు రెండింటికీ అవసరమైన విభిన్నమైన వాహన శ్రేణి దీని సొంతం. PV స్పేస్‌లో కంపెనీ మంచి వృద్ధి నమోదు చేసింది. గత నెలలో వాహన విక్రయాలు 45 వేల 878 యూనిట్లు కాగా.. గతేడాది ఈ సంఖ్య 43 వేల 341 యూనిట్లుగా ఉంది. తద్వారా 5.8 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది.
YoY వాల్యూమ్ వృద్ధి 2 వేల 537 యూనిట్లుగా ఉంది. కానీ అంతకుముందు నెల విక్రయాల్లో చూపించిన జోరును కొనసాగించడంలో మాత్రం విఫలమైంది. ఏప్రిల్ 2023లో 47 వేల 7 యూనిట్లను సెల్ చేయగా.. మేలో కేవలం 1,129కే పరిమితమైంది. అంటే MoM 2.40 శాతం మేర క్షీణత నమోదైంది.

2023 మరియు 2024 చివరి భాగంలో పలు కొత్త లాంచ్ లకు సిద్ధమైంది. హారియర్ మరియు సఫారి SUVలతో పాటు నెక్సన్ సబ్ 4m SUV, టాటా కర్వ్ కాంపాక్ట్ SUV వంటి పలు మోడల్స్ ఉన్నాయి. వీటితో పాటు పంచ్ వంటి మోడల్ కూడా CNG వేరియంట్ నుంచి వచ్చే అవకాశం ఉంది. PV విభాగంలో విక్రయించిన మొత్తం 45 వేల 984 యూనిట్లలో.. 5 వేల 805 ఎలక్ట్రిక్ వాహనాలు టాటా మోటార్స్ వాటాగా ఉంది.
వీటిలో Nexon EV ప్రైమ్, Nexon EV మాక్స్, టియాగో EV మరియు టిగోర్ EV, పంచ్ EV, హారియర్ EV మరియు సఫారి EV కూడా ఉన్నాయి. టాటా EV అమ్మకాలు మే 2022లో విక్రయించబడిన 3 వేల 505 యూనిట్ల నుంచి సంవత్సరానికి 66 శాతం వృద్ధి చెందాయి. టాటా మోటార్స్ వాహనాలు ఇప్పటికీ CV స్పేస్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్నాయి.


Click it and Unblock the Notifications