Tata Investment Stock: టాటా గ్రూప్ అంటేనే నమ్మకం. అయితే అలా గుడ్డిగా నమ్మి ఈ కంపెనీ షేర్లు కొన్న వారు ప్రస్తుతం నిండా మునిగారు. టాటా గ్రూప్ షేర్ కేవలం వారం రోజుల్లో ఇన్వెస్టర్లను పేదలుగా మార్చేసింది. ప్రస్తుతం షేర్ లోయర్ సర్క్యూట్లో ట్రేడింగ్ కొనసాగిస్తోంది.
టాటా గ్రూప్ లిస్టెట్ కంపెనీ అయిన టాటా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ షేర్లు కొనుగోలు చేసిన పెట్టుబడిదారులు ప్రస్తుతం గందరగోళంలో ఉన్నారు. ఇటీవలి కాలంలో కొనసాగిన మార్కెట్ల ర్యాలీలో కంపెనీ షేర్లు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ షేర్లు దాని పెట్టుబడిదారులకు భారీ నష్టాలను కలిగిస్తున్నాయి. గత వారంలో స్టాక్ పెట్టుబడిదారులకు ఒక్కో షేరుపై సుమారు రూ.2,000 నష్టాన్ని కలిగించింది. ఈరోజు మార్కెట్ ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలోనూ షేర్లు 5 శాతం లోయర్ సర్క్యూట్ ధర రూ.6,473 వద్ద కొనసాగుతున్నాయి.

వరుసగా ఆరు ట్రేడింగ్ సెషన్లలో కంపెనీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. ఈ క్రమంలో స్టాక్ లోయర్ సర్క్యూట్ తాకింది. ఈ కాలంలో షేర్ విలువ దాదాపు 18 శాతానికి పైగా పడిపోయింది. గత నెలలో కంపెనీ షేర్లు 10 శాతానికి పైగా పెరిగింది. గత ఆరు నెలల్లో పెట్టుబడిదారుల సొమ్మును దాదాపు రెండున్నర రెట్లు అంటే 136 శాతం రాబడిని అందుకున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు స్టాక్ 52 శాతం రాబడిని అందించింది. ఐదేళ్ల కిందట ఒక్కో షేరు ధర కేవలం రూ.835.70 వద్ద ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.9,756.85గా, 52 వారాల కనిష్ఠ ధర రూ.1,730 వద్ద కొనసాగుతోంది.
రిజర్వు బ్యాంక్ నిబంధనల ప్రకారం.. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ సెప్టెంబర్ 2025 నాటికి లిస్ట్ చేయాల్సి ఉంది. దీనిని ఎగువ శ్రేణి NBFCగా వర్గీకరించబడిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు దీనిని ఇన్వెస్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని పిలిచేవారు. ఇది నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. ప్రధానంగా ఈక్విటీ షేర్లు, ఈక్విటీ-సంబంధిత సెక్యూరిటీల వంటి దీర్ఘకాలిక పెట్టుబడుల్లో పాల్గొంటుంది. కంపెనీ ఫిబ్రవరి 2008లో టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థగా మారింది. టాటా సన్స్, ఇతర టాటా గ్రూప్ కంపెనీలతో పాటు, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ పెయిడ్-అప్ క్యాపిటల్‌లో సుమారుగా 73.38% కలిగి ఉంది.


Click it and Unblock the Notifications