Tata Stock: మంగళవారం నాడు దేశీయ స్టాక్ మార్కెట్లు అలజడిలో కొనసాగినప్పటికీ టాటాలకు చెందిన కంపెనీ షేర్లు మాత్రం భారీ ర్యాలీని కొనసాగించాయి. ఈ క్రమంలో ఒక్క రోజే స్టాక్ ధర ఏకంగా రూ.1,000 మేర పెరిగింది.
టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ షేర్లు నేడు ఇన్వెస్టర్ల దృష్టిని అధికంగా ఆకర్షించాయి. ఇంట్రాడేలో 20 శాతం అంటే రూ.1000 పెరిగి సరికొత్త 52 వారాల గరిష్ఠమైన రూ.5,799.40 స్థాయికి చేరాయి. అయితే దీని వెనుక పెద్ద కారణం ఉంది. కంపెనీ డిసెంబర్ త్రైమాసిక ఫలితాల్లో లాభాల్లో 53 శాతం పెరిగాయి. అలాగే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.29,300 కోట్లుగా ఉంది.

డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 36.87 శాతం పెరిగి రూ.51.6 కోట్లకు చేరుకుందని టాటా గ్రూప్ కంపెనీ జనవరి 23న ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. క్రితం ఏడాది కాలంలో ఆదాయం కేవలం రూ.37.7 కోట్లుగా ఉన్నాయి. 2024లో కంపెనీ షేర్లు 33.37 శాతం లాభపడగా.. గత ఏడాది 169 శాతం మేర వృద్ధి చెందాయి. కంపెనీకి చెందిన మెుత్తం 1.05 లక్షల షేర్లు నేడు బీఎస్ఈలో చేతులు మారాయి. వీటి విలువ దాదాపు రూ.56.27 కోట్లుగా ఉంది.
టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ప్రధానంగా ఈక్విటీ షేర్లు, ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీల వంటి దీర్ఘకాలిక పెట్టుబడులలో పాల్గొంటుంది. కంపెనీ కార్యకలాపాలు ప్రధానంగా లిస్టెడ్, అన్‌లిస్టెడ్ ఈక్విటీ షేర్లు, లోన్ సాధనాలు, మ్యూచువల్ ఫండ్స్, వివిధ పరిశ్రమల్లోని ఇతర కంపెనీల్లో పెట్టుబడులను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications