Tata Steel News: టాటాలకు ఒకదాని తర్వాత మరొక వ్యాపారంలో కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2024 టాటాలకు కలిసిరాలేదని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఇండియాలోని వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న గ్రూప్ ప్రస్తుతం ఇతరదేశాల్లోని వ్యాపార కార్యకలాపాల్లో ఎదురైన సమస్యలతో సతమతమౌతోంది.
వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌లోని టాటా గ్రూప్ నిర్వహిస్తున్న టాటా స్టీల్ కంపెనీలో కష్టాలు పెరిగాయి. బ్రిటన్‌లోని టాటా స్టీల్‌లో పనిచేస్తున్న దాదాపు 1500 మంది ఉద్యోగులు జూలై 8 నుంచి నిరవధిక సమ్మెను ప్రారంభించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ వార్తల మధ్య టాటా స్టీల్ షేర్లు శుక్రవారం మార్కెట్లు ముగింపు సమయంలో రూ.179.85 రేటు వద్ద ప్రయాణాన్ని ముగించాయి. అయితే మరోపక్క యాక్సిస్ సెక్యూరిటీస్ కంపెనీ షేర్లకు తాజా టార్గెట్ ధరను రూ.197కి పెంచుతూ తన అంచనాలను ప్రకటించింది. దీనికి ముందు 2024 జూన్ 18న కంపెనీ షేర్లు 52 వారాల గరిష్ఠ ధర రూ.184.60ను తాకింది. దీంతో ఇప్పుడు ట్రేడర్ల దృష్టి టాటా స్టీల్ కంపెనీ షేర్లపై కొనసాగుతోంది.

వివాదాన్ని పరిశీలిస్తే.. బ్రిటన్ టాటా స్టీల్ కంపెనీ అందులో పనిచేస్తున్న దాదాపు 2800 మంది ఉద్యోగులను తొలగించాలని చూస్తోంది. దీంతో వేల్స్‌లోని లాన్‌వెర్న్‌లోని పోర్ట్ టాల్బోట్‌లో ఉన్న ప్లాంట్‌లలో బ్లాస్ట్ ఫర్నేస్‌ను మూసివేయడాన్ని నిరసిస్తూ ఈ సమ్మె జరుగుతోంది. టాటా స్టీల్ UK కార్యకలాపాలను తీవ్రంగా ప్రభావితం చేసే లక్ష్యంతో బ్రిటన్‌లోని ఉక్కు కార్మికులు సమ్మె చేయడం 40 ఏళ్లలో ఇదే తొలిసారని యూనైట్ యూనియన్ పేర్కొంది.
టాటా గ్రూప్ పోర్ట్ టాల్బోట్ అండ్ లాన్‌వెర్న్‌లో ఉన్న దాదాపు 1,500 మంది టాటా ఉద్యోగులు 2,800 ఉద్యోగాలను తగ్గించడాన్ని, దాని బ్లాస్ట్ ఫర్నేస్‌లను మూసివేయడానికి కంపెనీ యోచనకు వ్యతిరేకంగా నిరవధిక సమ్మెను ప్రారంభించనున్నట్లు యూనియన్ తన ప్రకటనలో పేర్కొంది. తాము కేవలం టాటా కార్మికుల కోసం మాత్రమే కాదని తమ కమ్యూనిటీ భవిష్యత్తు కోసం, వేల్స్‌లోని ఉక్కు పరిశ్రమ భవిష్యత్తు కోసం పోరాడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో టాటా విధ్వంసకర ప్రణాళికలను ఆపే వరకు సమ్మె కొనసాగుతుందని వారు చెబుతున్నారు. ఉక్కు పరిశ్రమను కాపాడేందుకు యునైట్ వేల్స్ పోరాడుతోంది.
ప్రస్తుతం టాటా స్టీల్ UKలో 8,000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. మొత్తం కోత విధించిన దాదాపు 2,500 ఉద్యోగాలు వచ్చే 18 నెలల్లో పోయే అవకాశం ఉందని కంపెనీ జనవరిలో తెలిపింది. 500 మిలియన్ పౌండ్ల ప్రభుత్వ డబ్బు మద్దతుతో తక్కువ కార్బన్ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్‌లకు మారడం ద్వారా నష్టపోతున్న UK వ్యాపారాన్ని తట్టుకునేందుకు టాటా గ్రూప్ జనవరిలో మూసివేతలను ప్రకటించింది. యూనియన్ సమ్మె నిర్ణయంపై టాటా స్టీల్ ప్రతినిధి స్పందిస్తూ.. సమ్మె చర్యకు పిలుపునిచ్చేందుకు యునైట్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం తమను నిరాశకు గురిచేసినట్లు పేర్కొన్నారు. యునైట్‌తో సహా అన్ని యూనియన్‌లు గతంలో ఆమోదించినట్లుగా, యునైట్ మా మెరుగైన ఆఫర్‌ను దాని సభ్యులకు అందించాలని తాము ఆశించినట్లు పేర్కొన్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications