TCS Shares: ఇటీవలి కాలంలో టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీల్లో భారీ బుల్ ర్యాలీ కొనసాగుతోంది. ఒకదాని తర్వాత మరొకటి ఊహించని పనితీరును కనబరిచి ఆశ్చర్యపరుస్తున్నాయి. దీంతో అనేక టాటా కంపెనీల్లో పెట్టుబడిదారుల కోలాహలం కొనసాగుతోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది టాటా గ్రూప్‌లోని దేశీయ అతిపెద్ద టెక్ దిగ్గజం టీసీఎస్ గురించే. మంగళవారం ఇంట్రాడే ట్రేడ్‌లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ షేర్లు 4% కంటే ఎక్కువ లాభపడ్డాయి. దీంతో కంపెనీ షేర్లు సరికొత్త 52 వారాల గరిష్ఠమైన రూ.4,140 రేటును తాకాయి. దీని తర్వాత కంపెనీ మార్కెట్ క్యాప్ ఏకంగా రూ.15 లక్షల కోట్లను దాటేసింది. వరుసగా ఐదు రోజుల నుంచి కంపెనీ షేర్లలో పెరుగుదల ప్రస్తుత రికార్డు గరిష్ఠాలకు దారితీసింది. దీనికి ముందు స్టాక్ చివరిసారిగా 2021లో రూ.4,123 మార్కును అందుకుంది.

మార్కెట్ క్యాప్ పరంగా టీసీఎస్ ప్రస్తుతం దేశంలో రెండవ అత్యంత ఖరీదైన కంపెనీగా మారిపోయింది. ముఖేష్ అంబానీకిచెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మెుదటి స్థానంలో కొనసాగుతూ రూ.20 లక్షల కోట్ల విలువను కలిగి ఉంది. ఇదే క్రమంలో టాటాలకు చెందిన టైటాన్, టాటా మోటార్స్, ట్రెంట్, టాటా పవర్, ఇండియన్ హోటల్స్, టాటా ELXI వంటి ఇతర స్టాక్‌లు కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. ప్రస్తుతం టీసీఎస్ షేర్లను ట్రాక్ చేస్తున్న 44 మంది విశ్లేషకుల్లో 23 మంది కంపెనీ షేర్లను కొనాల్సిందిగా సూచిస్తూ BUY రేటింగ్ ఇచ్చారు. రానున్న కాలంలో టీసీఎస్ స్టాక్ ధర రూ.4,359 స్థాయిలకు చేరుకోవచ్చని వారు అంచనా వేస్తున్నారు. ఇదే క్రమంలో 10 మంది షేర్లను విక్రయించాలని సూచిస్తున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో మూడో త్రైమాసికంలో టెక్ దిగ్గజం టీసీఎస్ నికర లాభం 8.2 శాతం పెరిగి రూ.11,735 కోట్లకు చేరుకుంది. భారత్ నేతృత్వంలోని వర్ధమాన మార్కెట్లలో బలమైన రెండంకెల వృద్ధి కారణంగా సమీక్షిస్తున్న త్రైమాసికంలో తమ టర్నోవర్ కూడా నాలుగు శాతం పెరిగి రూ.60,583 కోట్లకు చేరుకుందని కంపెనీ పేర్కొంది. ఈ క్రమంలో నికర మార్జిన్ 19.4 శాతంగా ఉన్నట్లు ప్రకటించింది. అలాగే కంపెనీ అందించిన వివరాల ప్రకారం దాదాపు 8.1 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు పైప్‌లైన్‌లో ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications