Discount On Gold: భారతీయులు పసిడి ప్రియులు. అందులోను వస్తున్నది పండుగల సీజన్. ఇలాంటి సమయంలో దాదాపు అందరూ కొనాలనుకునేది బంగారాన్నే. పైగా ప్రస్తుతం బంగారం ధరలు చాలా వరకు తగ్గాయి. దీంతో మహిళలు ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో టాటాలు సూపర్ ఆఫర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

తనిష్క్ డబుల్ డిస్కౌంట్..
టాటాలకు చెందిన తనిష్క్ బంగారంపై ఏకంగా 7.5 శాతం రాయితీని అందిస్తోంది. దీంతో అనేక మంది గోల్డ్ ఆభరణాల కొనుగోలుకు మక్కువ చూపుతున్నారు. ఆభరణాల బ్రాండ్ తనిష్క్ దేశవ్యాప్తంగా 350 కంటే ఎక్కువ స్టోర్లను కలిగి ఉంది. భారీ కస్టమర్ బేస్‌ను కలిగిన తనిష్క్ సరసమైన ధరలకు బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. తనిష్క్ గోల్డెన్ హార్వెస్ట్ ఖాతా ద్వారా వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

ఎలా పొందాలి..?
తనిష్క్ గోల్డెన్ హార్వెస్ట్ అనేది ప్రాజెక్ట్ పేరు. ఈ స్కీమ్ కింద కనీస డిపాజిట్ నెలకు రూ.2,000గా ఉంది. తనిష్క్ గోల్డెన్ హార్వెస్ట్ అకౌంట్ ఓపెన్ చేసిన వ్యక్తి ఎంచుకున్న ఫిక్స్డ్ మెుత్తాన్ని ప్రతినెల క్రమం తప్పకుండా 10 నెలల పాటు డిపాజిట్ చేయాలి. అలా ఎంచుకున్న మెుత్తంలో 75 శాతం డిస్కౌంట్ అందించబడుతుంది. అంటే మీరు ప్రతినెల రూ.4,000 చెల్లించాలని ఎంచుకున్నట్లయితే.. అందులో మెుదటి సారి చెల్లిస్తున్నప్పుడు రూ.3,000 అదనంగా యాడ్ చేయబడుతుంది.

7.5 శాతం తగ్గింపు..
తనిష్క్ ఈ పథకం ప్రకారం మీరు నెలకు రూ.4,000 డిపాజిట్ చేయడం ప్రారంభిస్తే.. దీంతో 10 నెలల్లో మీ మొత్తం డిపాజిట్ రూ.40 వేలు అవుతుంది. మొదటి విడత రూ.4,000 కాబట్టి, మీకు అదనంగా తొలిసారి చెల్లించిన మెుత్తంలో 75% అంటే రూ.3,000 వస్తుంది. ఇది మొత్తం డిపాజిట్ మొత్తంలో 7.5 శాతం. మీరు 10 నెలల తర్వాత ఖాతాను రిడీమ్ చేసినప్పుడు.. మీరు రూ.43,000 విలువైన ఆభరణాలను కొనుగోలు చేసేందుకు అనుమతి ఉంటుంది. రూ.3,000 అనేది వడ్డీ బోనస్ అన్నమాట.

టైటాన్ స్పెషల్ మెంబర్ షిప్..
ఈ స్కీమ్‌లోని ఖాతాదారులు ఆభరణాలను రిడీమ్ చేసుకునేటప్పుడు తనిష్క్ అందించే ఇతర ఆఫర్‌లు సైతం పొందవచ్చు. ప్రత్యేకించి గోల్డెన్ హార్వెస్ట్ ఖాతాను తెరవడం ద్వారా.. మీరు టైటాన్ ప్రత్యేకమైన ప్రోగ్రామ్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. అదేవిధంగా అన్ని టైటాన్ స్టోర్‌లలో ప్రత్యేక మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌ను పొందవచ్చు.

తనిష్క్ యాప్..
ఎవరైనా తనిష్క్ గోల్డెన్ హార్వెస్ట్ ఖాతాను తెరవాలనుకుంటే.. వారు తనిష్క్ యాప్ లేదా తనిష్క్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఈ డబ్బును వినియోగదారులు ఏదైనా తనిష్క్ స్టోర్‌లో ఆభరణాల కొనుగోలు ద్వారా రిడీమ్ చేసుకోవచ్చు. పైగా ఈ అకౌంట్ కలిగిఉన్న వ్యక్తులు తమ పాత బంగారం స్వచ్ఛతను ఉచితంగా ఏదైనా స్టోర్ లో చెక్ చేసుకోవచ్చు.
More From GoodReturns

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

బంగారం ధరలు కాస్త శాంతించాయి.. లక్షా యాభై వేల రూపాయల దిగువకు.. మార్చి 21, శనివారం ధరలు ఇవే..

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట



Click it and Unblock the Notifications