నేటి సమాజంలో ఇండియన్ కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. వీటిలో టాటా గ్రూప్ ఘనత అలాగే ప్రత్యేకత మీకు తెలిసే ఉంటుంది. ప్రస్తుతం టాటా గ్రూప్ చాలా ఆకర్షణీయంగా మారింది. ఈ బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ 500 రిపోర్ట్ ప్రకారం, టాటా దేశంలోనే అత్యంత విలువైన గ్రూప్‌గా అవతరించింది. అది కూడా వరుసగా 15వ సారి ఈ ఘనత సాధించింది.
అయితే టాటా మార్కెట్ క్యాప్ 31.6 బిలియన్ డాలర్లుఅంటే ఇండియాలో సుమారు . దేశంలో ఒక బిజినెస్ గ్రూప్ 30 బిలియన్ డాలర్ల మార్కును దాటడం ఇదే తొలిసారి. టాటా భారతదేశంలో అత్యంత విలువైన బ్రాండ్‌గా అవతరించడం ఇది వరుసగా 15వ సంవత్సరం కావడం విశేషం. ఇక గత ఏడాదితో పోల్చితే టాటా మార్కెట్ క్యాపిటలైజేషన్ 28.6 బిలియన్ డాలర్లుగా ఉంది.

టాటా గ్రూప్ ప్రస్తుతం ప్రపంచంలోని టాప్ 100 కంపెనీలలో 60వ స్థానంలో ఉంది. టాటా తన AAA బ్రాండ్ బలం రేటింగ్‌ను తగ్గట్టుగా నిలుపుకుంది. ప్రస్తుతం టాటా గ్రూప్‌కు రతన్ టాటా తరుపున సోదరుడు నోయెల్ టాటా నాయకత్వం వహిస్తున్నారు. ఆయన టాటా ట్రస్ట్ చైర్మన్ కూడా.
మరోపక్క LIC - వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ బ్రాండ్: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ కంపెనీగా అవతరించింది. ఈ కంపెనీ బ్రాండ్ విలువ 36% పెరిగి $13.3 బిలియన్లకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా భారతీయ బ్రాండ్లు బ్రాండ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ (PSI)లో అధిక స్కోర్‌తో ఉన్నాయి.
అయితే ఈ ర్యాంకింగ్ ప్రకారం, LIC స్థానం 88. ఆరోగ్య బీమా రంగంలోకి వ్యూహాత్మక ప్రవేశంతో ఎల్‌ఐసి తన మార్కెట్ ఉనికిని అలాగే కస్టమర్ల నమ్మకాన్ని బలోపేతం చేసుకోవడానికి సహాయపడిందని ఈ నివేదిక పేర్కొంది.
భారతీయ ఐటీ అండ్ బ్యాంకింగ్ రంగం: భారతదేశ ఐటీ రంగం కూడా గొప్ప పురోగతిని సాధించింది. ఇన్ఫోసిస్ ప్రపంచవ్యాప్తంగా 132వ స్థానంలో ఉంది. ఇది ప్రపంచంలోనే మూడవ అత్యంత విలువైన IT సేవల బ్రాండ్. కంపెనీ వాల్యుయేషన్ ఈ ఏడాది 15% పెరిగి 16.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అలాగే, కంపెనీ గత 5 సంవత్సరాలలో 18% అన్యువల్ వార్షిక వృద్ధి రేటును సాధించింది.
భారత బ్యాంకింగ్ రంగంలోని మూడు కంపెనీలు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాయి. హెచ్‌డిఎఫ్‌సి (రూ. 14.2 బిలియన్లు), ఎస్‌బిఐ (రూ. 9.6 బిలియన్లు) అండ్ ఐసిఐసిఐ (రూ. 6.4 బిలియన్లు) ఉన్నాయి. ఎయిర్‌టెల్ (రూ. 7.7 బిలియన్లు) కాకుండా, జియో గ్రూప్ (రూ. 6.5 బిలియన్లు) ఇంకా రిలయన్స్ గ్రూప్ (రూ. 9.8 బిలియన్లు) వాల్యుయేషన్‌లో అగ్రగామిగా ఉన్నాయి. ఇవి అన్ని ఏడాది ప్రాతిపదికన 17% వృద్ధి చెందాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications