Tata News: మోదీ పర్యటనతో లక్ష్యద్వీప్‌కు మహర్థశ.. రంగంలోకి టాటా గ్రూప్.. పూర్తి వివరాలు
India-Maldives Row: గడచిన మూడు రోజులుగా మాల్దీవ్స్ భారత్ మధ్య వివాదం కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యద్వీప్ పర్యటనపై అక్కసు రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపాయి. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు బాయ్ కాట్ మాల్దీవ్స్ అంటూ సామాజిక మాధ్యమాల్లో మోదీకి అండగా నిలుస్తున్నారు.
ఈ క్రమంలో లక్ష్యద్వీప్ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 36 ద్వీపాల సమూహంలో తన వ్యాపారాన్ని విస్తరించాలని టాటా గ్రూప్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే 2026 నాటికి టాటాలకు చెందిన రెండు రిసార్ట్‌లు సుహేలీ, కద్మత్ దీవులలో ప్రారంభించబడనున్నాయి. గత ఏడాది జనవరిలో టాటా గ్రూప్ అనుబంధ సంస్థ ఇండియన్ హోటల్స్ కంపెనీ లక్ష్యద్వీప్‌లో రెండు తాజ్-బ్రాండెడ్ రిసార్ట్‌లపై సంతకం చేస్తున్నట్లు ప్రకటించింది. ఐహెచ్‌సిఎల్ అభివృద్ధి చేస్తున్న గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్‌లు 2026లో అందుబాటులోకి రానున్నాయి.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ దీవుల్లో పర్యటించిన సమయంలో చిత్రీకరించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పర్యాటకులు ఒక్కసారిగా ఈ సుందర ప్రదేశం గురించి తెలుసుకోవటం ప్రారంభించారు. ఈ క్రమంలో చాలా మంది భారతీయులు దీనిని మాల్దీవులతో పోల్చారు. బీచ్‌లు మెరుగ్గా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అయితే ఇక్కడ పర్యాటకుల కోసం తగిన వసతి ఏర్పాట్లపై ప్రస్తుతం దృష్టి పెరిగింది.
36 ద్వీపాల సమూహంలో బంగారం, అగట్టి, కద్మత్, మినీకాయ్, కవరత్తి, సుహేలి వంటి అనేక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కద్మత్ భారతదేశంలోని అత్యంత అందమైన డైవ్ కేంద్రాల్లో ఒకటిగా కూడా ఉద్భవించింది. సుహేలి వద్ద తాజ్ త్వరలో 60 బీచ్ విల్లాలు, 50 వాటర్ విల్లాలతో సహా 110 గదులు ఉంటాయని కంపెనీ తెలిపింది. అలాగే కద్మత్‌లోని తాజ్ హోటల్‌లో 75 బీచ్ విల్లాలు, 35 వాటర్ విల్లాలు ఉంటాయని కంపెనీ ప్రకటించింది.


Click it and Unblock the Notifications