Bigbasket IPO: కొన్నేళ్ల కిందట స్టార్టప్ కంపెనీలు తమ ప్రస్థానాన్ని ప్రారంభించిన అనేక కంపెనీలు ఇప్పుడు పబ్లిక్ ఇష్యూ ద్వారా ఈక్విటీ మార్కెట్లలోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే టాటా గ్రూప్ ఆధీనంలోని బిగ్ బాస్కెట్ సైతం ఐపీవో మార్గంలో స్టాక్ మార్కెట్లోకి వస్తుందని వార్తలు వచ్చాయి.

2025లో ఐపీవో..?
నివేదికల ప్రకారం టాటా గ్రూప్ ఈ ఐపీవోను 2025లో మార్కెట్లోకి తీసుకొస్తుందని తెలుస్తోంది. టాటా గ్రూప్ ఆన్‌లైన్ కిరాణా వ్యాపారం అయిన బిగ్ బాస్కెట్ స్టార్టప్ రానున్న మూడేళ్లలో దేశీయ మార్కెట్లలో లిస్ట్ కానుందని తెలుస్తోంది. దీనికి ముందే కంపెనీ ప్రైవేట్ ఇన్వెస్టర్ల నుంచి ఫండింగ్ పొందుతోంది. ఐపీవో వచ్చే వరకు ఇదే ప్రక్రియ కొనసాగుతుందని తెలుస్తోంది.

ఫండింగ్ వివరాలు..
ఆన్‌లైన్ రిటైలర్ ఇటీవల ఫండింగ్ రౌండ్లో నిధులను సేకరించింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ 3.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. బెంగళూరు కేంద్రంగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న బిగ్ బాస్కెట్ రానున్న 24-36 నెలల్లో ఐపీవోను తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ విబుల్ పరేఖ్ వెల్లడించారు. అలాగే పబ్లిక్ షేర్ ఇష్యూకు ముందు ప్రత్యేకంగా నిధులు సేకరిస్తామని చెప్పారు.

ఫాస్ట్ డెలివరీ సర్వీసెస్..
దేశవ్యాప్తంగా తనసేవలను విస్తరించాలని ప్లాన్ చేస్తున్న బిగ్ బాస్కెట్ 200 మిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా ఉంది. సేకరించిన నిధులను సమానంగా విభజించి పెట్టుబడి పెట్టడం జరుగుతుందని తెలుస్తోంది. కంపెనీ BB Now పేరిట ఫాస్ట్ డెలివరీ సేవను అందించడానికి ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా వస్తువులను కేవలం 30 నిమిషాల్లో కస్టమర్లకు డెలివరీ చేయాలని ప్లాన్ చేస్తోంది. దీనికోసం మార్చి 2023 నాటికి 200-300 స్టోర్లలో అవుట్‌లెట్‌లను కలిగి ఉండాలని యోచిస్తోంది.

టాటా ప్లే..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 55 నగరాల్లో ఉన్న సేవలను 75 నగరాలకు విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది. కంపెనీ దాదాపు 450 పట్టణాల్లో ఉంది. గతవారం టాటా ప్లే తన ఐపీవో గురించి సమాచారాన్ని విడుదల చేసింది. త్వరలోనే సెబీకి పత్రాలను సమర్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే టాటా ప్లే ఐపీవో పై కంపెనీ పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications