టాటా గ్రూప్ కంపెనీ చరిత్రలో తొలిసారి టాప్ మేనేజ్‌మెంట్ వేతనాలు తగ్గిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా చాలా కంపెనీల్లో ఉద్యోగాల కోత, వేతన కోతలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. రిలయన్స్‌లోను రూ.15 లక్షల కంటే ఎక్కువ శాలరీ ఉన్నవారికి వేతనాల్లో కోత విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు టాటా గ్రూప్ కంపెనీలకు కూడా వేతన కోత తప్పలేదు. ఈ కంపెనీ తొలిసారి ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

చంద్రశేఖరన్ సహా టాటా గ్రూప్ సీఈవోలు, ఎండీల వేతనాల్లో కోత
టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సహా ఈ గ్రూప్‌లోని కంపెనీలు టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్, టీసీఎస్, ట్రెంట్, టాటా ఇంటర్నేషనల్, టాటా క్యాపిటల్, వోల్టాస్ సంస్థల సీఈవోలు, ఎండీల వేతనాల్లో 20 శాతం కోత ఉంటుంది. కరోనా - లాక్ డౌన్ కారణంగా ఆర్థిక సంస్థలు మూతబడిన విషయం తెలిసిందే. దీంతో అన్ని కంపెనీలు, ఉద్యోగులపై భారీగా ప్రభావం పడింది. టాటా గ్రూప్ పైనా కరోనా ప్రభావం పడింది. దీంతో టాప్ మేనేజ్‌మెంట్ వేతన కోతకు సిద్ధమైంది.

బోనస్‍లోను కోత
అంతేకాదు, ఈ ఏడాదికి గాను బోనస్ కూడా వదులుకోనన్నారు. ఈ వరుసలో గ్రూప్ ప్రధానమైన అత్యంత లాభదాయక సంస్థ టీసీఎస్ సీఈవో రాజేష్ గోపినాథన్ ముందు వరుసలో ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2019-20లో రాజేష్ రెమ్యునరేషన్ 16.5 శాతం తగ్గి రూ.13.5 కోట్లకు చేరుకుంది.
తమ టాప్ మేనేజ్‌మెంట్ వేతనంలో కోత కంపెనీకి కొంత సహాయంగా ఉంటుందని ఇండియన్ హోటల్స్ తెలిపింది.ఈ ఏడాది బోనస్‌లోను కోత ఉంటుందని పేర్కొంది.

విస్తారా, ఇండియన్ హోటల్స్‌పై ప్రభావం
టాటా స్టీల్ బోర్డు వేతనాల కోతపై నిర్ణయం తీసుకుంటుందని ఈ సంస్థ అధికార ప్రతినిధి చెప్పారు. ఎలా ముందుకు వెళ్తామో ఇప్పుడే చెప్పలేమన్నారు. టాటా గ్రూప్ తమ ఉద్యోగుల్లో కొంతమంది వేతనాలు తగ్గించవచ్చునని వార్తలు వచ్చాయి. కరోనా ప్రభావం ఆతిథ్య రంగంపై, వాహన రంగంపై భారీగా ప్రభావం చూపింది. దీంతో టాటా గ్రూప్‌లోని ఇండియన్ హోటల్స్, విస్తారా, టాటా మోటార్స్ ఎక్కువగా ప్రభావితమయ్యాయి.

సగటున 11 శాతం పెరిగింది
టాటా గ్రూప్‌లోని టాప్ 15 మంది వేతనాలు 2018 నుండి 2019 మధ్య కాలంలో సగటున 11 శాతం పెరిగింది. చంద్రశేఖరన్ రెమ్యునరేషన్ 19 శాతం పెరిగి రూ.54 కోట్ల కమిషన్ సహా రూ.65.52 కోట్లు తీసుకున్నారు. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి టీసీఎస్ సీఈవో రాజేషన్ గోపినాథన్ 16.5 శాతం నుండి 13.3 శాతానికి తగ్గించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications