Tata group: స్మార్ట్‌పోన్ తయారీలోకి టాటా గ్రూప్.. ఆ చైనీస్ బ్రాండ్ కొనుగోలుకు చర్చలు
Vivo News: భారతీయులు అత్యంత ఎక్కువగా విశ్వసించే టాటా గ్రూప్ స్మార్ట్‌ఫోన్ తయారీ బిజినెస్‌లోకి ఎంటర్ కానుంది. ఇటీవల దేశంలో ఆపిల్ తయారీని ప్రారంభించగా.. స్మార్ట్‌ఫోన్ మాన్యుఫ్యాక్చరింగ్ లోనూ సత్తా చాటాలని చూస్తోంది. గతంలోనూ మొబైల్స్ తయారీలో అనుభవనం ఉన్నా అప్పట్లో పలు కారణాల వల్ల ఆ విభాగం నుంచి పక్కకు తప్పుకుంది. కాగా ఈసారి రెట్టింపు వేగంతో దూసుకుపోవాలని భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే మంచి బూమ్‌లో ఉన్న కంపెనీని కొనుగోలు చేయాలని ప్లాన్ చేసింది.
BBK గ్రూప్ యాజమాన్యంలోని చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో భారతీయ యూనిట్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయాలని టాటా గ్రూప్ భావిస్తోంది. ఇందుకోసం సదరు సంస్థతో చర్చలు జరుపుతున్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి. వాల్యుయేషన్ విషయంలో ఓ అంగీకారానికి రాకపోవడంతో తుది ఒప్పందం ఇంకా కుదరలేదని తెలుస్తోంది. టాటా గ్రూప్ కోట్ చేసిన దాని కంటే వివో ఎక్కువ వాల్యుయేషన్ కోరుతుండగా.. ఇప్పటికీ ఈ కొనుగోలు పట్ల టాటా గ్రూప్ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.

పన్ను ఎగవేత మరియు మనీలాండరింగ్ నిరోధక చట్టం ఉల్లంఘనలకు సంబంధించి వివోపై భారతీయ నియంత్రణ సంస్థలు దర్యాప్తు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనాలోని BBK గ్రూప్‌కు చెందిన మరో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో కూడా తన భారతీయ యూనిట్‌ను ఉపసంహరించుకోవడానికి లోకల్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.
చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీతో ఏదైనా భారతీయ సంస్థ భాగస్వామ్యంలో జాయింట్ వెంచర్ ఉండే విధంగా చూడాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఇందులోను దేశీయ సంస్థకు కనీసం 51 శాతం వాటా ఉండేలా చూడడానికి ఆసక్తిగా కనబరుస్తోంది. అదనంగా ఈ జాయింట్ వెంచర్ లో స్థానిక నాయకత్వంతో పాటు పంపిణీ వ్యవస్థ కూడా దేశీయ సంస్థ చేతిలోనే ఉండాలని కోరుతోంది.


Click it and Unblock the Notifications