For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిగ్ బాస్కెట్‌లో మెజార్టీ వాటా... సూపర్ యాప్ తర్వాత టాటా గ్రూప్ మరో కీలక అడుగు!

|

ఇండియన్ ఆన్‌లైన్ గ్రాసరీ స్టార్టప్ బిగ్‌బాస్కెట్‌లో టాటా గ్రూప్ మెజార్టీ వాటాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు రెండు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయని ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. 1 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.7,350 కోట్లు)కు ఈ డీల్ కుదరవచ్చునని భావిస్తున్నారు. చర్చలు పురోగతిలో ఉన్నట్లు చెబుతున్నారు.

గ్రూప్‌లోని కన్స్యూమర్ బిజినెస్‌లను అన్నింటిని కలుపుతూ ఇటీవల టాటా గ్రూప్ సూపర్ యాప్‌ను రూపొందిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దేశీయంగా అమెజాన్, రిలయన్స్ సంస్థలు ఈ-కామర్స్‌లో వేగంగా విస్తరిస్తున్నాయి. టాటా గ్రూప్ కూడా ఈ-కామర్స్ దిశగా అడుగులు వేస్తోంది.

ముఖేష్ అంబానీXజెఫ్ బెజోస్: రూ.1.92 లక్షల కోట్ల సంపద ఆవిరి!!ముఖేష్ అంబానీXజెఫ్ బెజోస్: రూ.1.92 లక్షల కోట్ల సంపద ఆవిరి!!

టాటా గ్రూప్, బిగ్ బాస్కెట్ డీల్

టాటా గ్రూప్, బిగ్ బాస్కెట్ డీల్

బెంగళూరుకు చెందిన బిగ్ బాస్కెట్.. వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఫ్రెష్ సేవలతో పోటీ పడుతోంది. ఎందుకంటే కరోనా సమయంలో చాలామంది ఆన్‌లైన్ షాపింగ్‌కు మొగ్గు చూపుతున్నారు. వినియోగదారులు ఇంటి వద్దనే ఉండి ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారు. సూపర్ యాప్ ద్వారా ఈ-కామర్స్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న టాటా గ్రూప్.. ఇప్పుడు బిగ్ బాస్కెట్‌లో మెజార్టీ వాటాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. టాటా గ్రూప్, బిగ్ బాస్కెట్ ఈ అంశంపై స్పందించాల్సి ఉంది.

అలీబాబా విక్రయం!

అలీబాబా విక్రయం!

చైనాకు చెందిన అలీబాబా గ్రూప్‌కు బిగ్ బాస్కెట్‌లో 26 శాతం వాటా ఉంది. తమ వాటాను మొత్తాన్ని అలీబాబా విక్రయించాలని భావిస్తోందని కూడా వార్తలు వస్తున్నాయి. చర్చలు సాగుతున్నాయని, పురోగతిలో ఉన్నాయని, అయితే చివరకు ట్రాన్సాక్షన్‌కు దారి తీస్తుందా లేదా చెప్పలేమని అంటున్నారు. బిగ్ బాస్కెట్‌లో భారీ వాటా కోసం టాటా గ్రూప్ 500 మిలియన్ల నుండి 700 మిలియన్ డాలర్ల మేర చెల్లింపులు జరపవచ్చునని కూడా తెలుస్తోంది.

సగం వాటా దక్కించుకోవచ్చు..

సగం వాటా దక్కించుకోవచ్చు..

1 బిలియన్ డాలర్లతో టాటా గ్రూప్.. బిగ్ బాస్కెట్‌లో దాదాపు సగం వాటాను కూడా చేజిక్కించుకోవచ్చునని తెలుస్తోంది. ఇదిలా ఉండగా బిగ్ బాస్కెట్ ఫండ్ రెయిజింగ్ కోసం వివిధ ఇన్వెస్టర్లతో చర్చలు జరిపింది. సింగపూర్‌కు చెందిన టెమ్‌సెక్, అమెరికా జనరేషన్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్, ఫిడెలిటీ అండ్ టైబోర్న్ క్యాపిటల్ వంటి వాటితో 350 బిలియన్ల నుండి 400 బిలియన్ల ఫైనాన్షియల్ రౌండ్స్ కోసం చర్చలు జరిపింది. 20 కోట్ల డాలర్ల సమీకరణకు ఇటీవల టాటా గ్రూప్‌తోను చర్చలు నిర్వహించిందని తెలుస్తోంది.

English summary

బిగ్ బాస్కెట్‌లో మెజార్టీ వాటా... సూపర్ యాప్ తర్వాత టాటా గ్రూప్ మరో కీలక అడుగు! | Tata Group to buy majority stake in BigBasket for about 1 billion dollar

Indian online grocery startup BigBasket is in advanced talks to sell a majority stake for about $1 billion to salt-to-software conglomerate Tata Group, the Economic Times reported here on Wednesday, citing three sources familiar with the matter.
Story first published: Wednesday, October 28, 2020, 13:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X