Telangana: టాటాలతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణలో పెట్టుబడులపై కీలక చర్చ..
Tata Group: కొత్త ఏడాది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డీ పెట్టుబడులు ఆకర్షించే పనిలో బిజీగా గడుపుతున్నాయి. గత నెలలో అదానీ గ్రూప్, అమరరాజా గ్రూప్ అధిపతులతో చర్చలు సైతం జరిపిన సంగతి తెలిసిందే.
తాజాగా టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ తెలంగాణలోని 50 ప్రభుత్వ ITIలలో అధునాతన నైపుణ్య కేంద్రాలను నెలకొల్పడానికి రూ.1,500 కోట్ల పెట్టుబడిని ప్లాన్ చేస్తోంది. కొత్త కోర్సుల కోసం మాస్టర్ ట్రైనర్‌లను నియమించడం కూడా ఇందులో భాగంగా ఉంది. దీనికి తోడు టాటాల యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా విమానాల విస్తరణ హైదరాబాద్ అంతర్జాతీయ, దేశీయ కనెక్షన్‌లను పెంచడం, నగరాన్ని కీలక రవాణా కేంద్రంగా మార్చటంలో లక్ష్యంగా టాటాలు పెట్టుకున్నారు.

టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ గ్లోబల్ ఇండస్ట్రీ లీడర్‌లతో ఇప్పటికే ఉన్న జాయింట్ వెంచర్‌ల ద్వారా వ్యూహాత్మక రక్షణ, ఏరోస్పేస్ సెక్టార్‌లో తన వృద్ధిని మరింత పెంచుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక ఇతర దేశాల్లోని కంపెనీల ప్రముఖులతో చర్చలు జరుపుతూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వ్యాపార అవకాశాలు, అపార మానవ వనరులు, ప్రభుత్వ ప్రోత్సాహకాల గురించి విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు.
ఈ క్రమంలోనే ఉబెర్, Qcentrio వంటి ఇతర కంపెనీలు కూడా తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రణాళికలను ప్రకటించాయి. ఇందులో కొత్త సేవలు, ఉద్యోగ కల్పన ఉన్నాయి. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన రూ.40,232 కోట్ల విలువైన పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నెలల వ్యవధిలోనే రాష్ట్రానికి పెట్టుబడులు రావటంపై ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications