Tata Group: ఉప్పు నుంచి సాఫ్ట్‌వేర్ వరకు వ్యాపారాలను టాటా గ్రూప్ కలిగి ఉంది. దేశంలో పురాతనమైన వ్యాపార సంస్థల్లో ఒకటిగా ఉన్న టాటాలు సమాజానికి సంపదను తిరిగి ఇచ్చేందుకు తమ లాభాలను వినియోగిస్తుంటారు.
ఈ క్రమంలో భారతదేశపు అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూప్ తన స్థానాన్ని నిలుపుకుంది. బ్రాండ్ ఫైనాన్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం టాటా గ్రూప్ 26.4 బిలియన్ డాలర్ల విలువతో అత్యంత విలువై బ్రాండ్ గా నిలిచింది. ఇదే క్రమంలో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. కరోనా తర్వాత అనిశ్చిత రాజకీయ భౌగోళ పరిస్థితుల్లో దేశంలోని టాప్-100 అత్యంత విలువైన బ్రాండ్‌లు సమిష్టిగా వృద్ధిని ప్రదర్శించాయి.

టాటా గ్రూప్ బ్రాండ్ విలువ గత సంవత్సరంతో పోలిస్తే 10.3 శాతం పెరిగి 26.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంత అత్యధిక విలువను సాధించిన మెుదటి కంపెనీ ఇది. ప్రపంచ వ్యాప్తంగా టాప్-500 కంపెనీల జాబితాలో నిలిచిన ఏకైక భారతీయ బ్రాండ్ గా టాటా గ్రూప్ నిలిచింది. సాంకేతిక వినియోగంత ద్వారా గత రెండేళ్లలో టాటా గ్రూప్ వ్యూహాత్మక పరివర్తనకు గురైందని బ్రాండ్ ఫైనాన్స్ డైరెక్టర్ సావియో డిసౌజా తెలిపారు.
ఇదే క్రమంలో దేశంలో అత్యంత విలువైన కంపెనీల జాబితాలో ఇన్ఫోసిస్ అనిశ్చితుల మధ్య రెండవ స్థానాన్ని కొనసాగించింది. ఇదే సమయంలో మహీంద్రా గ్రూప్ టాప్-10 అత్యంత విలువైన బ్రాండ్‌ల జాబితాలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో మహీంద్రా గ్రూప్ 7 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో ఏడవ స్థానంలో నిలిచింది. రూ.1,21,269 కోట్ల రాబడిపై తొలిసారిగా రూ.10,000 కోట్లను అధిగమించి రికార్డు లాభాలతో గత ఆర్థిక సంవత్సరంలో గ్రూప్ అసాధారణమైన పనితీరును కనబరిచింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications