Tata News: వరుసగా రెండు రోజుల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు పతనాన్ని చూస్తున్నాయి. బడ్జెట్ ప్రసంగానికి ముందరు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపటం ప్రధానంగా మార్కెట్ల క్షీణతకు కారణంగా నిపుణులు సూచిస్తున్నాయి.
అయితే ఈ సమయంలోనూ టాటాలకు చెందిన స్టాక్ తన విజయ పరంపరను కొనసాగించింది. వివరాల్లోకి వెళితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది టాటా గ్రూప్ కంపెనీ టాటా టెలిసర్వీసెస్ మహారాష్ట్ర లిమిటెడ్(TTML) గురించే. దేశంలోని 60 నగరాల్లో టాటా టెలిసర్వీసెస్ సేవలు అందిస్తోంది. శుక్రవారం మార్కెట్ల భారీ పతనంలోనూ ఈ కంపెనీ షేర్లు ఇంట్రాడేలో ఏకంగా 14 శాతం పెరుగుదలను నమోదు చేసి రూ.111.48 స్థాయిని అందుకుంది. అయితే చివిరికి నిన్న కంపెనీ షేర్లు బీఎస్ఈలో రూ.102.11 వద్ద ముగింపును నమోదు చేశాయి.

TTML షేర్లు శుక్రవారం ఏకంగా 20 నెలల గరిష్ట స్థాయిని తాకాయి. కంపెనీ స్టాక్స్ 2022 తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి. గత 2 ట్రేడింగ్ సెషన్లలో టాటా గ్రూప్ స్టాక్ ఏకంగా 37 శాతం పెరిగింది. జూలై 11న కంపెనీ షేర్లు రూ.74.97 స్థాయిలో ఉన్నాయి. అప్పటి నుంచి షేర్ల ధరలు 50 శాతం పెరిగాయి. అంటే కేవలం 5 ట్రేడింగ్ రోజుల్లో TTML స్టాక్ తన ఇన్వెస్టర్లకు ఏకంగా 50 శాతం రాబడిని అందించింది. ప్రస్తుతం కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.111.48గా ఉండగా, 52 వారాల కనిష్ఠ ధర రూ.65.29గా ఉంది. ఈ క్రమంలో టాటా స్టాక్ 52 వారాల కనిష్ట స్థాయి నుంచి 57 శాతం పెరుగుదలను సాధించడంలో విజయవంతమైంది. దీంతో ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.19,961.77 కోట్లుగా ఉంది.
ఈ టాటా గ్రూప్ కంపెనీలో ప్రమోటర్లు అత్యధికంగా 74.36 శాతం వాటాలను హోల్డ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో మొత్తం పబ్లిక్ హోల్డింగ్ 23.19 శాతం ఉండగా.. విదేశీ ఇన్వెస్టర్లు 2.38 శాతం వాటాలను కలిగి ఉన్నారు. మార్చి త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.324.90 కోట్లుగా నమోదైంది. ఇది డిసెంబర్ 2023లో ఆదాయం రూ.288.60 కోట్ల కంటే ఎక్కువ. అయితే మార్చి త్రైమాసికంలో కంపెనీ నష్టం రూ.309.30 కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications