Zudio: ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలంటే ప్రకటనలు, మార్కెటింగ్ కోసం భారీ మొత్తంలో వెచ్చించాల్సి ఉంటుంది. సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ అంబానీ నుంచి స్టార్టప్ వరకు పాటించే సూత్రం ఇదే. అయితే ఈ విషయంలో టాటాల రూటే సపరేటుగా ఉంది.
టాటా గ్రూపునకు చెందిన ఓ సంస్థ.. ప్రకటనల ప్రస్తావనే లేకుండా ఏకంగా 4 వేల కోట్లు ఆదాయాన్ని ఆర్జించింది. వెస్ట్‌సైడ్ పేరిట దేశ వ్యాప్తంగా ప్రీమియం వస్త్రాలను టాటా గ్రూపు విక్రయిస్తోంది. అయితే భారీ మొత్తం వెచ్చించలేని వారికి సైతం నాణ్యమైన బట్టలను అందించాలనే ఉద్దేశంతో జూడియోను రంగంలోకి దింపింది.

దేశంలోని 95 శాతం మంది ప్రజలను లక్ష్యంగా చేసుకుని 2016లో జూడియోను టాటా గ్రూపు ప్రారంభించింది. అప్పటి నుంచి 7 సంవత్సరాలుగా దిగ్విజయంగా తన జైత్రయాత్ర కొనసాగిస్తూ వస్తోంది. కానీ ఇప్పటివరకు టాటా గ్రూపు నుంచి జూడియో కోసం ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు. అయినప్పటికీ విపరీతంగా వృద్ధిని కనబరుస్తోంది.
జూడియో విజయ రహస్యం చిన్న పట్టణాలపై దృష్టి పెట్టడమేనని చెప్పవచ్చు. సరైన కస్టమర్ బేస్‌ను ఎన్నుకుని వారి టేస్ట్ కు తగిన విధంగా, అందుబాటు ధరల్లో వస్త్రాలను విక్రయించడం మరో సక్సెక్ మంత్రం. ఇందుకోసం జూడియో తన స్టోర్‌లను ఎక్కువగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలలో నెలకొల్పింది. మెయిన్ సెంటర్స్‌కు దూరంగా షాపులు పెట్టి అద్దె, అడ్వాన్స్ చెల్లింపులను ఆదా చేయడం వంటి ఎన్నో ట్రిక్స్ ఈ విజయానికి కారణంగా తెలుస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications