Ambani Vs Tata: అంబానీపై వార్ ప్రకటించిన టాటాలు.. డబుల్ డీల్ మేకింగ్..
Ambani Vs Tata: దేశంలో ఉప్పు నుంచి ఉక్కు వరకు, సాఫ్ట్‌వేర్ నుంచి విమానయానం వరకు అనేక కీలక వ్యాపారాల్లో టాటా గ్రూప్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అంబానీ, టాటాలకు మధ్య ఏఐ వార్ మెుదలైంది.
అమెరికాకు చెందిన చిప్ తయారీ సంస్థ Nvidiaతో భాగస్వామ్యం ప్రకటించిన తర్వాత టాటా గ్రూప్ కూడా ఏఐ భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి కంప్యూటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్లాట్‌ఫారమ్‌లను అందించడానికి ఎన్విడియా- టాటా గ్రూప్ భాగస్వామ్యం కానున్నాయని చిప్ తయారీదారు ప్రకటించింది.

ఇదే విషయంపై టాటా చీఫ్ ఎన్ చంద్రశేఖరన్ స్పందిస్తూ.. ఎన్‌విడియాతో భాగస్వామ్యం AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు యాక్సెస్‌ను ప్రజాస్వామ్యం చేస్తుందన్నారు. అలాగే దేశంలో AI సొల్యూషన్ల ఏర్పాటు వేగవంతం చేస్తుందన్నారు. AI ప్రతిభను స్కేల్‌లో అప్‌గ్రేడ్ చేయడానికి వీలు కల్పిస్తుందని స్పష్టం చేశారు. అత్యుత్తమ పనితీరును సాధించడానికి తదుపరి తరం NVIDIA® GH200 గ్రేస్ హాప్పర్ సూపర్‌చిప్ ద్వారా ఆధారితమైన AI సూపర్ కంప్యూటర్‌ను రూపొందించడానికి కంపెనీలు కలిసి పని చేస్తాయి.
తాజా భాగస్వామ్యం కింద టాటా కమ్యూనికేషన్స్, ఎన్విడియా భారతదేశంలో AI క్లౌడ్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. దీనికింద అభివృద్ధి చేసే ఏఐ మౌలిక సదుపాయాలను, సామర్థ్యాలను టీసీఎస్ కూడా ఉపయోగించుకుంటుందని తెలుస్తోంది. ఎన్‌విడియా భాగస్వామ్యం TCSని AI-ఫస్ట్ విధానంతో రీఇమాజినేషన్‌ని నడపడానికి తన కస్టమర్‌లతో సహకరించడంలో మరింతగా ఎనేబుల్ చేస్తుందని కంపెనీ వెల్లడించింది.


Click it and Unblock the Notifications