Layoffs news: దేశం గర్వించదగ్గ వ్యక్తుల్లో రతన్ టాటా ఒకరు. ఎన్నో కంపెనీలను స్థాపించి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. లాభనష్టాలు కంటే దేశానికి ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తిత్వం ఆయనది. ఆయా కంపెనీలు పలుమార్లు వేల మందికి ఉద్వాసన పలుకుతున్నప్పటికీ, సిబ్బందిని తొలగించడం సరైన పరిష్కారం కాదని భావించిన వ్యక్తి. అందుకే టాటా గ్రూప్ లో ఉద్యోగం చేస్తున్నారు అంటే దాదాపు ప్రభుత్వ ఉద్యోగి అని ఫిక్స్ అయిపోతారు
ఆ నమ్మకానికి గండి పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే వేలాదిమంది ఉద్యోగులను తొలగించేందుకు టాటా గ్రూప్ సిద్దమైనట్లు ప్రకటించింది. గ్రూపుకు చెందిన టాటా స్టీల్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూపు సంస్థ నుంచి 2 వేల 500 మందిని ఇంటికి పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఈ మేరకు ఉద్యోగులకు సమాచారం సైతం చేరవేసింది. దీంతో అక్కడ నిరసనలు చెలరేగి సిబ్బంది ఆందోళనకు దిగారు

ఇలా కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం లేకపోలేదు. ఫర్నస్ విషయంలో మార్పే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇందులో భాగంగా సాధారణ బ్లాస్ట్ ఫర్నెస్కు బదులు ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెసు మారుతుంటుందిది. అందుకే వేలాదిమందిని తొలగిస్తున్నట్లు ర్మ్మను చెప్పింది. కానీ విదేశాల్లో సిబ్బంది అంత తేలిపోయినవి కాదు అక్కడి చట్టాలు అందుకు అనుమతించవు. తడిసిమోపెడు అవుతున్న ఖర్చులు తగ్గించడం కోసం కూడా సంస్థ ఆ విధంగా చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ ఎలా ముందుకు వెళ్తుందోనని ఆసక్తి నెలకొంది. సంస్థ మాత్రం పక్కా ప్రణాళికలతో ఏ మాత్రం ఇబ్బంది తలెత్తకుండా కనిపిస్తోంది. దీనికితోడు మూడేళ్లలో కార్బన్ అధికారాలను పూర్తిగా తగ్గించుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. దాన్ని చేరుకునేందుకు అవసరమైన చర్యలు సైతం తీసుకోవడం మొదలుపెట్టింది కానీ టాటా గ్రూప్ నుంచి లే ఆఫ్ అంటే ఎవరికి అంత త్వరగా నమ్మబుద్ధికావడం లేదు.


Click it and Unblock the Notifications