Tata Neu: సాల్డ్ నుంచి సాఫ్ట్ వేర్ వరకు టాటాలు చేయని వ్యాపారం లేదు. అయితే దేశంలో తన వ్యాపారాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని గ్రూప్ నిర్ణయించింది. ఈ క్రమంలో భాగంగా అనేక సేవలను ఒకే వేదికమీదకు తీసుకొచ్చింది.
దేశంలోని ఈ-కామర్స్ రంగంలో పెను సంచలనాలు సృష్టించే దిశగా టాటాలు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో అదానీ గ్రూప్, రిలయన్స్ గ్రూప్, వాల్‌మార్ట్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి దిగ్గజాలకు పెద్ద పోటీని ఇవ్వనుంది. ఇందుకోసం తన ప్రఖ్యాత టాటా న్యూ యాప్‌ను గత ఏడాది ఏప్రిల్‌లో కంపెనీ లాంచ్ చేసింది. ఈ క్రమంలో రిలయన్స్, అదానీ గ్రూప్స్ సైతం తమ సూపర్ యాప్ లను లాంట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాయి.

ప్రస్తుతం టాటాలు తమ సూపర్ యాప్ టాటా నియోలోకి 2 బిలియన్ డాలర్ల మూలధనాన్ని అందించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా వెల్లడైందని బ్లూమ్ బెర్గ్ వార్తా సంస్థ వెల్లడించింది. ఒకవేళ ఇది కార్యరూపం దాల్చితే టాటా గ్రూప్ ఆదాయాల విషయంలో అతిపెద్ద గ్రోత్ చూడపోతోందని తెలుస్తోంది. ఈ మెుత్తాన్ని కంపెనీ సేవల విస్తరణ, సాంకేతిక పురోగతితో పాటు ఇతర అవసరాలకు వినియోగించనుందని తెలుస్తోంది.
ప్రస్తుతం టాటాలు పెట్టుబడిగా పెట్టే రెండు బిలియన్ డాలర్లను రానున్న రెండేళ్లలో తిరిగి పొందగలదని తెలుస్తోంది. ఇలా చేయటం ద్వారా చైనాకు చెందిన అలీపే, వీచాట్ వంటి సంస్థల మాదిరిగా టాటా న్యూ ను అభివృద్ధి చేయాలని టాటాలు చూస్తున్నారు. మెుదటి ఆర్థిక సంవత్సరంలో 8 బిలియన్ డాలర్ల విక్రయాలను దీని ద్వారా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కంపెనీ కేవలం అందులో సగం అయిన 4 బిలియన్ డాలర్లను మాత్రమే చేరుకోగలదని తెలుస్తోంది.

సూపర్ యాప్ లాంచ్ నుంచి అనేక టెక్నికల్ గ్లిచ్‌లను కలిగి ఉంది. దీనిపై కస్టమర్ల నుంచి ఫిర్యాదులు సైతం భారీగానే అందాయి. ఈ క్రమంలో టాటా న్యూ లో కొత్తగా పెట్టుబడులు పెట్టాలని కంపెనీ సరైన సమయంలో నిర్ణయించిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కంపెనీ పెట్టుబడులు యాప్ సాంకేతిక లోపాలను సరిచేందుకు, టెక్నికల్ గా మరింత మెరుగైన సేవల అనుభూతిని కస్టమర్లకు అందించేందుకు సహాయపడుతుందని తెలుస్తోంది. అయితే దీనిపై కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications