GoFirst: బడ్జెట్ ధరల్లో విమాన ప్రయాణ సేవలను అందించే గోఫస్ట్ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. విమానాలను తిరిగి నడిపేందుకు యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల పరిస్థితులు కనిపించటం లేదు. ఈ రోజు ఎన్సీఎల్టీ కంపెనీ దివాలా దరఖాస్తుపై తీర్పు వెలువరించనుంది.
భారతదేశ అతిపెద్ద వ్యాపార సమ్మేళనం టాటా గ్రూప్ తో పాటు.. దేశంలోని అతిపెద్ద ఎయిర్‌లైన్ ఇండిగో, గో ఎయిర్‌లైన్స్ ఇండియా లిమిటెడ్ నుంచి ఎయిర్‌బస్ SE విమానాలను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గోఫస్ట్ దివాలా రక్షణ కోసం దాఖలు, టిక్కెట్ల అమ్మకాలను నిలిపివేయమని డీజీసీఏ సూచించిన తర్వాత ఇది వెలుగులోకి వచ్చింది.

ఒకపక్క 36 విమానాల తిరిగి స్వాధీనం చేసుకునేందుకు గోఫస్ట్ లీజర్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే ఈ చర్యలను నిలుపుదల చేయాలని వాడియా గ్రూప్ ఎన్సీఎల్టీని కోరింది. ఇదే సమయంలో టాటా గ్రూప్, ఇండిగో సంస్థలు ప్రస్తుతం గో ఫస్ట్ లీజర్‌లతో విడివిడిగా చర్చలు జరుపుతున్నాయని బ్లూమ్ బర్గ్ నివేదించింది. అదనంగా రెండు కంపెనీలు ల్యాండింగ్, పార్కింగ్ స్లాట్ ఏర్పాట్లకు సంబంధించి న్యూఢిల్లీ, ముంబైలోని విమానాశ్రయ నిర్వాహకులతో చర్చలు జరుపుతున్నాయి.
ఇదే క్రమంలో ఇతర విమానయాన కంపెనీలు గోఫస్ట్ స్లాట్‌లను పొందేందుకు తమ ఆసక్తి చూపుతున్నాయి. ప్రఖ్యాత ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలాకు చెందిన ఆకాశ సైతం ఆసక్తి చూపిన సంస్థల్లో ఉంది. గో ఫస్ట్ ఆస్తులకు అధిక డిమాండ్ కారణంగా ఎయిర్‌లైన్ రుణ పునర్నిర్మాణ ప్రణాళికలు, కార్యకలాపాలను పునఃప్రారంభించే ప్రయత్నాలకు అడ్డంకులు ఏర్పడవచ్చని ఏవియేషన్ నిపుణులు భావిస్తున్నారు.
గో ఫస్ట్ స్కై హై ఎక్స్‌సీవి లీజింగ్ లిమిటెడ్, ఎసీజీ ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ ఐర్లాండ్ లిమిటెడ్, ఎస్‌ఎమ్‌బీసీ ఏవియేషన్ క్యాపిటల్ లిమిటెడ్ ప్రధాన లీజర్లలో ఉన్నాయి. ఎయిర్‌లైన్ తన ఆపరేటింగ్ లైసెన్స్‌ను నిలుపుకోగలదా లేదా అనే దానిపై తదుపరి రెండు వారాల్లోగా తీర్పు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications