Tata iPhone: యాపిల్ తన ఉత్పాదనను చైనా నుంచి తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దీని కారణంగా iPhone 14 సిరీస్ ఉత్పత్తిని భారత్ కు తరలిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ క్రమంలో తైవాన్ కంపెనీలు భారత్ లో తైవాన్ కు చెందిన Foxconn, Wistron Corp ప్రస్తుతం ఆపిల్ ఫోన్లను తయారు చేస్తున్నాయి. ఈ క్రమంలో రానున్న రోజుల్లో ఎలక్ట్రానిక్స్ తయారీ జాయింట్ వెంచర్ ప్లాంట్‌ను స్థాపించి ఐఫోన్‌ను అసెంబుల్ చేసేందుకు టాటా విస్ట్రాన్‌తో చర్చలు జరుపుతోంది.

ఉద్రిక్తతల నేపథ్యంలో..
ప్రస్తుతం ఆపిల్ తయారీలో వినియోగించే అనేక కాంపొనెంన్ట్స్ ఎక్కువగా చైనాలోనే తయారవుతున్నాయి. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ ఉన్న ఇతర తైవాన్ తయారీ సంస్థలు సైతం చైనాను వీడాలని యోచిస్తున్నాయి. ఈ కారణంగా వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని టాటా గ్రూప్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ఆపిల్ ఐఫోన్..
టాటా గ్రూప్ చేస్తున్న ప్రయత్నాలతో త్వరలో ఆపిల్ ఐఫోన్ ఉత్పత్తి భారత్‌లో ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. ఈ విషయంలో ముమ్మరంగా చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

విస్ట్రాన్ - ఆపిల్..
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఆపిల్ కీలక సరఫరాదారుల్లో ఒకటైన తైవాన్ (విస్ట్రాన్) టాటా గ్రూప్‌తో చర్చలు జరుపుతోంది. ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, సప్లై చైన్, అసెంబ్లింగ్‌లో విస్ట్రాన్ అనుభవాన్ని టాటా గ్రూప్ ఉపయోగించుకునేందుకు ఇవి దోహదపడనున్నట్లు తెలుస్తోంది. లేని పక్షంలో టాటా ప్రత్యేకంగా సొంత యూనిట్ ప్రారంభించే అవకాసం ఉందని సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ దక్కించుకోవటానికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ముందువరుసలో పోటీపడుతున్నాయి.

సమస్యలమయంగా చైనా..
ప్రస్తుతం చైనా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. కరోనా కట్టిడికి రీజో కొవిడ్ విధానం, పవర్ కట్స్, నీటి సమస్యలతో పాటు పొలిటికల్ టెన్షన్స్ కంపెనీలకు నష్టాలను మిగులుస్తున్నాయి. దీనికి తోడు చైనా, అమెరికా, తైవాన్ మధ్య ఉద్రిక్తతలతో కంపెనీలు ఇతర దేశాలకు తరలిపోతున్నాయి. పైగా ఆర్థిక మందగమనం చైనాను అతలాకుతలం చేయటంతో కంపెనీల ఉత్పత్తి తీవ్రంగా ప్రభావితం అవుతోంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications