Noel Tata: రతన్ టాటా మార్క్ చెరిపేస్తున్న నోయెల్ టాటా..! కొత్త రోడ్ మ్యాప్ సిద్ధం..
Tata Group: దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది అభిమానులను సంపాదించుకున్న వ్యాపారవేత్త రతన్ టాటా. అయితే ఆయన మరణం తర్వాత ప్రస్తుతం టాటా గ్రూప్ పెద్ద మార్పులకు లోనవుతోంది. ప్రస్తుతం నోయెల్ టాటా బాధ్యతలు చేపట్టిన వేళ జరుగుతున్న మార్పులను ఇన్వెస్టర్లు ఆసక్తిగా గమనిస్తున్నారు.
టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా మరణానంతరం ఆయన సోదరుడు నోయెల్ టాటా పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం దశాబ్ధాలుగా రతన్ టాటా నేతృత్వంలోని చారిత్రాత్మక వ్యాపార పద్ధతులకు దూరంగా, రతన్ టాటా లెగసీ విధానానికి భిన్నంగా కొత్త మోడల్ వైపు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఇకపై టాటా గ్రూప్ కింద నడిచే ప్రతి కంపెనీ తన అప్పులు బాధ్యతలను స్వతంత్రంగా నిర్వహించాల్సి ఉంటుందని తెలుస్తోంది. అంటే ఇండివిడ్యువల్ కంపెనీలుగా వాటి పనితీరుకు అనే నిర్వహించుకుని ఉత్తమ పనితీరును కనబరచాల్సి ఉంటుందని తెలుస్తోంది.

తాజా చర్యల్లో భాగంగా టాటా సన్స్ టాటా డిజిటల్, టాటా ఎలక్ట్రానిక్స్, ఎయిర్ ఇండియా వంటి కొత్త వెంచర్లకు ఇకపై ఆర్థిక బాధ్యతలను స్వతంత్రంగా నిర్వహించాల్సిందిగా కోరింది. దీనికి అనుగుణంగా ఇకపై రుణదాతలకు కంఫర్ట్ లెటర్‌లు, క్రాస్-డిఫాల్ట్ క్లాజులను అందించడం వంటి పద్ధతులను నిలిపివేయాలని కంపెనీలను ఆదేశించింది. ఇదే విషయాన్ని టాటా సన్స్ బ్యాంకులకు సైతం స్పష్టం చేసింది. వ్యాపార విస్తరణలో భాగంగా ఇకపై కొత్త వెంచర్లకు అవసరమైన పెట్టుబడుల అంతర్గత వనరుల నుంచి కేటాయించబడతాయని వెల్లడించింది.
గత ఏడాది టాటా సన్స్ తన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకి స్వతంత్రంగా సరండర్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే రూ.20,000 రుణాలను చెల్లించి అన్ లిస్టెట్ సంస్థగా నిలవాలని నిర్ణయించింది. అలాగే ప్రధానంగా కొత్త కంపెనీల ఏర్పాటుకు అవసరమైన నిధులను టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నుంచి ఏర్పాటు చేసుకోవాలని భావిస్తోంది. ఇది చాలా కీలకంగా కంపెనీ భవిష్యత్తు కోసం భావిస్తోంది.
ప్రస్తుతం టాటా సన్స్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికే లిస్టెడ్ కంపెనీలుగా కొనసాగుతున్న టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్, టాటా కన్జూమర్ ప్రొడక్ట్ కంపెనీలపై ఉండదని పేర్కొంది. ఇప్పటికే ఈ కంపెనీలు తమ ఆర్థిక అంశాలను స్వతంత్రంగా నిర్వహించుకుంటున్నట్లు గ్రూప్ వెల్లడించింది. అలాగే రతన్ టాటా మరణించిన కొన్ని నెలలు గడిచిన ప్రస్తుత తరణంలో కాంపిటీటివ్ కమిషన్ ఆపిల్ కాంట్రాక్ తయారీదారు Pegatron Technology Indiaలో టాటా ఎలక్ట్రానిక్స్ మెజారిటీ వాటాలను కొనుగోలు చేసేందుకు అనుమతించటం శుభపరిణామం. ఇది రెండు విడతలుగా పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications