Tata Group: ఆ కంపెనీని మూసేయాలని నిర్ణయించిన టాటా గ్రూప్.. అయోమయంలో ఉద్యోగులు.. ఎందుకిలా..?
Tata Group: మారుతున్న వ్యాపార పరిస్థితులకు అనుగుణంగా టాటాలు సైతం నయా ప్లాన్లతో విస్తరణ బాట పట్టారు. అయితే తాజా పరిస్థితిలు చూస్తుంటే కొంత ఆందోళన కరంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కంపెనీలను కలిపేస్తున్న ప్రకటన చేసింది. అయితే ఒక కంపెనీని మూసేస్తున్నట్లు ప్రకటించటం ఇప్పుడు ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తుంది.

కంపెనీ మూసివేత..
ప్రాజెక్ట్‌ల టాటా ఇండస్ట్రీస్ విభాగం కింద పనిచేస్తున్న తన హెల్త్‌కేర్ సేవల వ్యాపారాన్ని మూసివేయాలని టాటా హెల్త్ నిర్ణయించింది. వ్యాపారాల పునర్నిర్మాణంలో భాగంగా అనేక లాభదాయక వ్యాపారాల విభజనలను మూసివేయవచ్చు లేదా గ్రూప్ లోని ఇతర కంపెనీలతో విలీనం కావచ్చు. దీనివల్ల ఖర్చులు తగ్గించేందుకు కంపెనీ భారీ ప్రణాళికను సిద్ధం చేసింది.

టాటా హెల్త్..
టాటా హెల్త్ ప్రారంభించి 7 సంవత్సరాలు అయ్యింది. ఇది టాటా ఇండస్ట్రీస్‌లో ఒక భాగం. టాటా గ్రూప్ డిజిటల్ హెల్త్ విభాగమైన టాటా హెల్త్ కస్టమర్లకు ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, పర్సనలైజ్డ్ హెల్త్‌కేర్ సేవలను అందిస్తోంది. ప్రస్తుతం కంపెనీ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోంది. అక్టోబర్ 1 నుంచి టాటా 1mg (టాటా డిజిటల్ ద్వారా ఆధారితం) ద్వారా వినియోగదారులకు డిజిటల్ ఆరోగ్య సేవలు కూడా అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.

కంపెనీ సమాచారం..
టాటా హెల్త్ యాప్‌లో అందించే అన్ని డిజిటల్ హెల్త్‌కేర్ సేవలు అక్టోబర్ 1 నుంచి.. టాటా 1mg ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. దీని కారణంగా ఉద్యోగులు ఉపాధి కోల్పోవలసిన అవసరం లేదని తెలుస్తోంది.

మూసివేత ఎందుకంటే..
వ్యాపారాన్ని విస్తరించలేక, ఆకర్షించలేక టాటా హెల్త్ బిజినెస్ యూనిట్‌ను మూసివేస్తున్నట్లు టాటా ఇండస్ట్రీస్ ప్రకటించింది. ఈ యాప్ ద్వారా హెల్త్ చెకప్ ప్యాకేజీ, ఆన్‌లైన్ డాక్టర్ కన్సల్టేషన్, ఈ-ఫార్మసీ సర్వీస్ వంటి అనేక సేవలు ఒకే చోట అందించబడ్డాయి.

7 మెటల్ కంపెనీల విలీనం..
టాటా గ్రూప్ రెండు రోజుల కిందట కంపెనీల విలీనం విషయంలో ఒక కీలక ప్రకటన చేసింది. టాటా గ్రూప్‌లోని ఏడు మెటల్ ఆధారిత కంపెనీలను టాటా స్టీల్‌తో విలీనం చేస్తున్నట్లు వెల్లడించింది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. టాటా స్టీల్ లాంగ్ ప్రొటెక్ట్స్, టాటా మెటాలింక్స్, టిన్‌ప్లేట్ కంపెనీ ఆఫ్ ఇండియా, టిఆర్‌ఎఫ్, ఇండియన్ స్టీల్ & వైర్ ప్రొటెక్ట్స్, టాటా స్టీల్ మైనింగ్, ఎస్ అండ్ టి మైనింగ్ అనే 7 కంపెనీలు టాటా స్టీల్ కంపెనీలో భాగస్వాములుగా మారనున్నాయి.

కంపెనీల విలీనంతో ప్రయోజనం..
ఒకే రంగానికి చెందిన వివిధ కంపెనీలను ఒక గొడుకు కిందకు తీసుకురావటం వల్ల కంపెనీ నియంత్రణ సులువుగా మారుతుంది. దీనికి తోడు పనితీరు మెరుగుపడటమే కాక ఖర్చులు సైతం భారీగా తగ్గుతాయి. ఇది కంపెనీల లాభదాయకతపై పెనుమార్పును కలిగిస్తుంది. ఇన్వెస్టర్లకు సైతం మేలు చేస్తుంది. ఈ వార్త వెలువడిన తర్వాత ఇన్వెస్టర్లు టాటా స్టీల్ స్టాక్ కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపే అవకాశం ఉంది.