Tata Group: 7 రోజులుగా టాటా స్టాక్ పరుగులు.. లాభాల సునామీ.. మీ దగ్గర ఉందా..?
Tata Stock: ఇటీవల దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ కొనసాగుతోంది. ఈ క్రమంలో చాలా మంది పెట్టుబడిదారులు తమకు నచ్చిన, దీర్ఘకాలిక వ్యూహాల కోసం అనేక ప్రముఖ కంపెనీల్లో తమ డబ్బును పెట్టుబడిగా పెడుతున్నారు.
ఈ క్రమంలో టాటా గ్రూప్ లోని అనేక కంపెనీల మార్కెట్ క్యాప్ భారీగా పెరగటం పెట్టుబడిదారులను ధనవంతులుగా మార్చేసింది. వాస్తవానికి అనేక టాటా స్టాక్స్ గత కొన్ని వారాలుగా పరుగులు తీస్తూ లాభాల పంట పండిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో టాటా ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీ షేర్లు కూడా వచ్చి చేరాయి. ఇది మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, వెంచర్ క్యాపిటల్ ఫండ్ యూనిట్లలో కూడా పెట్టుబడి పెడుతుంది. సిమ్టో ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ, టాటా అసెట్ మేనేజ్‌మెంట్, టాటా ట్రస్టీలు కంపెనీకి అనుబంద సంస్థలుగా ఉన్నాయి.

టాటా గ్రూప్ కంపెనీ టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ షేర్ల పెరుగుదల శుక్రవారం ఆగిపోయింది. వారం చివరి ట్రేడింగ్ రోజున ఈ షేరు 2.28% పడిపోయి రూ.6,814.05 వద్ద ముగిసింది. దీనికి ముందు ఏడు ట్రేడింగ్ సెషన్లలో కంపెనీ షేర్ విలువ ఒక్కొక్కటి 36.15 శాతం మేర పెరిగాయి. దీంతో స్టాక్ తన కొత్త 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.7,115కి చేరుకుంది. టాటాలకు చెందిన ఈ మల్టీబ్యాగర్ గడచిన ఏడాది కాలంలో పెట్టుబడిదారులకు 250 శాతం రాబడిని అందించింది.
డిసెంబర్ త్రైమాసికంలో టాటా ఇన్వెస్ట్‌మెంట్స్ నికర లాభంలో 54.19 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో లాభం రూ.53.24 కోట్లు కాగా.. క్రితం ఆర్థిక సంవత్సరంలో రూ.34.53 కోట్లుగా ఉంది. బ్రోకరేజ్ సంస్థ ఆనంద్ రాఠీ ప్రకారం స్టాక్ సపోర్ట్ రేటు రూ.6,700గా నిర్ణయించగా.. బ్రేకౌట్ రూ.7,000 వద్ద ఉంచింది. ఈ క్రమంలో షేర్ ధర ఒక్కొక్కటి స్టాక్ రూ.7,200 వరకు పెరగవచ్చని పేర్కొంది. అలాగే Tips2Trades రామచంద్రన్ మాట్లాడుతూ టాటా ఇన్వెస్ట్‌మెంట్‌లు బుల్లిష్‌గా ఉన్నాయన్నారు. తదుపరి బ్రేక్‌అవుట్‌తో రోజువారీ చార్ట్‌లో రూ.7,663 వద్ద చాలా ఓవర్‌బాట్ ఉందన్నారు.
టాటా ఇన్వెస్ట్‌మెంట్స్ RBIలో రిజిస్టర్ చేయబడిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(NBFC). ఇంతకుముందు దీని పేరు ది ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. కంపెనీ ప్రధానంగా ఈక్విటీ షేర్లు, ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీల వంటి దీర్ఘకాలిక పెట్టుబడుల్లో డబ్బును ఉంచుతుంది. డిసెంబర్ 2023 నాటికి ప్రమోటర్లు కంపెనీలో 73.38 శాతం వాటాను కలిగి ఉన్నారు.


Click it and Unblock the Notifications