Tata Technologies: చాలా కాలంగా టాటాల నుంచి ఒక ఐపీవో మార్కెట్లోకి రాబోతోందనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను సంతోషానికి గురిచేసే ఒక తాజా అప్ డేట్ ను టాటా గ్రూప్ ప్రకటించింది.

18 ఏళ్ల తర్వాత..
2004లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ను లిస్టింగ్ చేసిన తర్వాత దేశీయ మార్కెట్‌ల్లోకి టాటాలు ఎలాంటి కంపెనీని ఐపీవో కోసం తీసుకురాలేదు. దాదాపు 18 ఏళ్ల విరామం తర్వాత టాటాల నుంచి మార్కెట్లోకి వస్తున్న మెుదటి కంపెనీగా టాటా టెక్నాలజీస్ నిలిచింది. అయితే దేశీయ ఇన్వెస్టర్లు ఈ ఐపీవో గురించి చాలా ఆసక్తికంగా ఎదురుచూస్తున్నారు.

DRHP దాఖలు..
టాటా మోటార్స్ అనుబంధ సంస్థ అయిన పూణేకు చెందిన టాటా టెక్నాలజీస్ మార్చి 10న SEBI వద్ద నిధుల సమీకరణ కోసం ఐపీవోకు పత్రాలను దాఖలు చేసింది. అయితే ఈ ఐపీవోలో 95.71 మిలియన్ షేర్లు ఆఫర్ ఫర్ సేల్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. దీనికోసం టాటా మోటార్స్ 81.13 మిలియన్ షేర్లను, ఆల్ఫా TC హోల్డింగ్స్ 9.72 మిలియన్ షేర్లను అందిస్తున్నాయి. వీటికి తోడు మిగిలిన వాటాను టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ ఆఫర్ చేస్తోంది.

టాటా మోటార్స్..
ప్రస్తుతం టాటా టెక్నాలజీస్ సంస్థలో దాదాపు 74.69 శాతం వాటను టాటా మోటార్స్ కలిగి ఉంది. టాటా టెక్నాలజీస్ అనేది గ్లోబల్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులకు టర్న్‌కీ సొల్యూషన్‌లతో సహా ఉత్పత్తి అభివృద్ధి, డిజిటల్ పరిష్కారాలను అందించే గ్లోబల్ ఇంజనీరింగ్ సేవల సంస్థగా కొనసాగుతోంది. ఇది ఏరోస్పేస్, రవాణా, నిర్మాణ రంగాలతో పాటు ఇతర పరిశ్రమల్లో క్లయింట్‌లకు సేవ చేయడానికి కంపెనీ ఆటోమోటివ్ పరిశ్రమలో డొమైన్ నైపుణ్యాన్ని ఉపయోగిస్తోంది. 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ లాభం రూ.437 కోట్లుగా ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా..
కంపెనీ మెుత్తం 11,081 మంది ఉద్యోగులను కలిగి ఉంది. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో 18 గ్లోబల్ డెలివరీ కేంద్రాలను కలిగి ఉంది. పూణే, గురుగ్రామ్, బెంగళూరు, థానే, చెన్నైలలో కేంద్రాలు ఉన్నాయి. దీనికి తోడు షాంఘై, బ్యాంకాక్, సింగపూర్, టోక్యో, వియత్నాంలో హనోయి, బ్రసోవ్, క్రయోవా, ఇయాసి, స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్, జర్మనీలోని గైమర్‌షీమ్, UKలోని వార్విక్‌లో కేంద్రాలను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications