For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tata IPO: రెండు దశాబ్దాల తర్వాత లక్కీఛాన్స్.. టాటా గ్రూప్ IPO.. అస్సలు మిస్ కావొద్దు..

|

Tata IPO: టాటా, బిర్లా, రిలయన్స్ వంటి దిగ్గజ కంపెనీల నుంచి ఐపీవోలు రావటం ప్రస్తుతం చాలా అరుదు. ఇవన్నీ దశాబ్దాలుగా తమ కంపెనీలను స్థిరంగా కొనసాగిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో దేశంలోని స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు ఒక గుడ్ న్యూస్ వచ్చేసింది. అదే పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ 19 ఏళ్ల తర్వాత మార్కెట్లోకి ఒక ఐపీవోతో మార్కెట్లోకి రావాలనుకోవటం.

ఐపీవో వివరాలు..

ఐపీవో వివరాలు..

టాటా మోటార్స్ అనుబంధ సంస్థ అయిన టాటా టెక్నాలజీస్ కంపెనీని ఐపీవోగా మార్కెట్లోకి తీసుకురావాలని గ్రూప్ నిర్ణయించింది. అయితే ఇది 19 ఏళ్ల తర్వాత టాటాల నుంచి మార్కెట్లోకి వస్తున్న ఐపీవో కావటం విశేషం. ఈ ఐపీవో ద్వారా కంపెనీ రూ.3,500 నుంచి రూ.4,000 కోట్లను సమీకరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ఇష్యూ తర్వాత కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ దాదాపు రూ.16,200 కోట్ల నుంచి రూ.20,000 కోట్ల వరకు ఉండవచ్చని సమాచారం. దీనిని కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే టాటాలు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు మూలాల ప్రకారం తెలుస్తోంది.

క్రమంగా పెరుగుదల..

క్రమంగా పెరుగుదల..

గత నెలలో టాటా మోటార్స్ బోర్డు IPO ద్వారా టాటా టెక్‌లో కొంత వాటాను విక్రయించే ప్రతిపాదనను ఆమోదించింది. అప్పటి నుంచి కంపెనీకి చెందిన అన్‌లిస్టెడ్ షేర్లు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం టాటా సన్స్‌ చైర్మన్‌గా ఉన్న ఎన్‌ చంద్రశేఖరన్‌ హయాంలో టాటా గ్రూప్‌కి ఇదే తొలి ఐపీవో కావటం విశేషం. అయితే కంపెనీ IPO కోసం ఇంకా ఎటువంటి తేదీని నిర్ణయించలేదు. కంపెనీలో టాటా మోటార్స్‌ 74.42 శాతం, ఆల్ఫా టీసీ 8.96 శాతం, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ 4.48 శాతం వాటా కలిగి ఉన్నాయి.

 చివరిగా 2004లో..

చివరిగా 2004లో..

దేశంలోని పురాతన వ్యాపార సామ్రాజ్యమైన టాటా గ్రూప్ చివరిగా 2004లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) IPOను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం దేశంలోని రెండవ అత్యంత విలువైన కంపెనీగా టీసీఎస్ ఎదిగింది. టీసీఎస్ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1,233,082.02 కోట్లుగా ఉంది. ఇక మెుదటి స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.1,671,800.07 కోట్లుగా ఉంది.

Read more about: tata group tata motors tata tech ipo
English summary

Tata IPO: రెండు దశాబ్దాల తర్వాత లక్కీఛాన్స్.. టాటా గ్రూప్ IPO.. అస్సలు మిస్ కావొద్దు.. | Tata group coming with IPO after 19 years to indian equity markets

Tata group coming with IPO after 19 years to indian equity markets
Story first published: Thursday, January 19, 2023, 16:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X