Tata iPhone: చారిత్రాత్మక డీల్‌కి చేరువలో టాటాలు.. ఐఫోన్ తయారీకి కొన్ని అడుగ దూరంలో..
Tata iPhone: భారత వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ ఆపిల్ ఫోన్ల తయారీ ఫ్యాక్టరీని కొనుగోలుకు దగ్గరకు చేరుకుంటోంది. ఆగస్టులో అసెంబ్లిక్ టాటాల చేతికి రావొచ్చని తెలుస్తోంది. ఈ ఘనత సాధించిన మెుదటి స్వదేశీ సంస్థగా టాటాలు నిలవనున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని 600 మిలియన్ డాలర్ల విలువైన విస్ట్రాన్ కార్పోరేషన్ ఫ్యాక్టరీని టేకోవర్ చేయాలని టాటాలు చూస్తున్నారు. ప్రస్తుతం ఇందులో దాదాపు 10,000 కంటే ఎక్కువ మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరు తాజాగా ఐఫోన్ 14 మోడర్ అసెంబ్లింగ్ కూడా చేశారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందేందుకు మార్చి 2024 నాటికి 1.8 బిలియన్ డాలర్ల ఐఫోన్లను తయారు చేసేందుకు విస్ట్రాన్ కట్టుబడి ఉంది.

టాటాల చేతికి ఫ్యాక్టరీ రానున్నట్లు వస్తున్న వార్తలపై టాటా, విస్ట్రాన్, యాపిల్ అధికార ప్రతినిధులు కామెంట్ చేసేందుకు నిరాకరించారు. విస్ట్రోన్ జూన్ 30తో ముగిసిన మూడు నెలల్లో భారత్ నుంచి దాదాపు 500 మిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్‌లను ఎగుమతి చేసింది. ఇదే సమయంలో ఫాక్స్‌కాన్, పెగట్రాన్ వంటి సంస్థలు సైతం స్థానికంగా వృద్ధి చెందాయి. కరోనా తర్వాత అమెరికా-చైనాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, తైవాన్-చైనా మధ్య పరిస్థితులతో చాలా కంపెనీలు అక్కడి నుంచి బయటకు వస్తున్న సంగతి తెలిసిందే.
భారత సంస్థ ఐఫోన్ తయారు చేస్తే.. ప్రపంచ ఫ్యాక్టరీగా ఉన్న చైనా హోదాను సవాలు చేసేందుకు మోదీ చేస్తున్న ప్రయత్నాలు గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. రానున్న కాలంలో ఇతర ప్రపంచ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్‌లు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి, ఇండియాలో తమ ఉత్పత్తి ప్రారంభించటాన్ని పరిగణనలోకి తీసుకునేలా ఒప్పించడంలో ఇది సహాయపడవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 155 ఏళ్లలో ఉప్పు నుంచి టెక్ సేవల వరకు విస్తరించిన టాటా గ్రూప్ ప్రరస్తుతం.. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి, ఈ-కామర్స్‌లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే టాటాలు తమ తమిళనాడు ఫ్యాక్టరీలో ఐఫోన్ బ్యాక్ మెటల్ చాసిస్ తయారు చేస్తోంది.


Click it and Unblock the Notifications