iPhone News: టాటాల చేతికి ఆపిల్ తయారీ ప్లాంట్..! ఇక ఐఫోన్ మేడ్ బై ఇండియన్స్..
Tata iPhone: టాటాలు సరికొత్త రికార్డుకు తెరలేపారు. ఇప్పటికే ఉప్పు నుంచి ఉక్కు వరకు, ఎయిర్ లైన్ నుంచి సాఫ్ట్ వేర్ వరకు అనేక రంగాల్లో వ్యాపారాలను కొనసాగిస్తున్న టాటాలు ఐఫోన్ దేశీయంగా తయారు చేసేందుకు సిద్ధమయ్యారు.
తైవాన్ ఐఫోన్ తయారీదారు విస్ట్రోన్ బెంగళూరు ప్లాంట్‌ను టాటాలు కొనుగోలు చేసింది. దీంతో టాటా గ్రూప్ దేశీయ, గ్లోబల్ మార్కెట్‌ల కోసం భారతదేశంలో ఆపిల్ ఐఫోన్ ఉత్పత్తిని ప్రారంభించనుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ & టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించారు. ఇండియాలో ఒక భారతీయ కంపెనీ ఐఫోన్లను తయారు చేయటం కొత్త చరిత్రకు నాంది పలికింది. దీనికోసం టాటాలు 125 మిలియన్ డాలర్లకు ఉత్పత్తి సౌకర్యాన్ని కొనుగోలు చేసింది.

తాజా డీల్ ద్వారా విస్ట్రోన్ ఇన్ఫోకామ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో విస్ట్రాన్ కార్ప్ 100% పరోక్ష వాటాను టాటా గ్రూప్ చేజిక్కించుకుంది. ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ గ్లోబల్ ఇండియన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీల వృద్ధికి మద్దతునిచ్చింది. దీంతో తయారీ, ప్రతిభ భాగస్వామిగా భారతదేశంపై గ్లోబల్ ఎలక్ట్రానిక్ బ్రాండ్ల నమ్మకాన్ని బలోపేతం చేసింది. దీనికి తోడు స్మార్ట్‌ఫోన్ తయారీ, ఎగుమతులకు భారతదేశాన్ని ప్రధాన కేంద్రంగా మార్చాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చొరవతో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడవుతున్న ఎక్కువ ఆపిల్ ఐఫోన్లను తైవాన్ తయారీ దిగ్గజాలైన Pegatron Corp, Foxconn Technology Group చేతుల్లోనే ఉన్నాయి. ఇదే సమయంలో ఆపిల్ సైతం తన ఉత్పత్తిని ఇండియాలో ఎక్కువ చేయాలని చూస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎల్ఐ స్కీమ్ కింద ప్రయోజనాలను ఉత్పత్తిదారులకు అందిస్తోంది.


Click it and Unblock the Notifications