సెమీకండక్టర్ యూనిట్లకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందిన కొద్ది వారాల్లోనే.. టాటా గ్రూప్ భారతీయ జనతా పార్టీ (BJP)కి దేశంలోనే అత్యధిక రాజకీయ విరాళం అందించింది. బీజేపీతోపాటు కాంగ్రెస్, ఇతర పార్టీలకు కూడా విరాళాలు అందించింది. ఈ పరిణామం వ్యాపార వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. దీని గురించిన ఒక ఆసక్తికర కథనం స్క్రోల్ (scroll.in) ప్రచురితమైంది. ఈ కథనం గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచ వ్యాప్తంగా సెమీ కండక్టర్లకు కొరత ఏర్పడటం, ఆటోమొబైల్ వంటి రంగాలపై సెమీకండక్టర్ల కొరత ప్రభావం చూపడం వంటి కారణాల దృష్ట్యా సెమీ కండక్టర్లను దేశీయంగా ఉత్పత్తి చేయాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల కేంద్ర ప్రభుత్వం సెమీ కండక్టర్ల యూనిట్లకు ఆమోదం తెలిపింది. అయితే ఈ కీలక రంగంలోకి ముందుగా టాటా గ్రూప్ ప్రవేశించింది. దేశంలో ఏర్పాటు కాబోతున్న మూడు సెమీ కండక్టర్ యూనిట్లలో రెండింటిని టాటా గ్రూప్ ఏర్పాటు చేయబోతోంది.
సెమీకండక్టర్ రంగంలోకి టాటా అడుగు
2024 ఫిబ్రవరి 29న, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దేశంలో మూడు సెమీకండక్టర్ యూనిట్లకు ఆమోదం లభించింది. అయితే వీటిలో రెండు యూనిట్లు టాటా గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్నాయి. ఒకటి గుజరాత్‌లోని ధోలేరాలో తైవాన్‌కు చెందిన పవర్‌చిప్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్ప్ భాగస్వామ్యంతో 'ఫ్యాబ్' యూనిట్. మరొకటి అస్సాంలోని మోరిగావ్‌లో చిప్‌ల అసెంబ్లీ, టెస్టింగ్, ప్యాకేజింగ్ యూనిట్.
ప్రభుత్వం నుండి భారీ ప్రోత్సాహం
సెమీకండక్టర్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ఇండియా సెమీకండక్టర్ మిషన్ పథకంలో భాగంగా.. ఈ యూనిట్ల నిర్మాణ వ్యయంలో 50% వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందించనుంది. టాటా గ్రూప్ యొక్క రెండు యూనిట్లకు కేంద్రం నుండి లభించే సబ్సిడీ మొత్తం దాదాపు రూ.44,203 కోట్లు. ఈ యూనిట్లలో టాటా గ్రూప్ మొత్తం రూ.1.18 లక్షల కోట్ల వరకు పెట్టుబడి పెట్టనుందని, దీని ద్వారా దాదాపు 46,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయని ప్రభుత్వం తెలిపింది.
ఆమోదం తర్వాత భారీ విరాళం
సెమీకండక్టర్ యూనిట్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన సరిగ్గా నాలుగు వారాల తర్వాత, టాటా గ్రూప్ రాజకీయ విరాళాలకు సంబంధించి ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. 2024 ఏప్రిల్ 2న టాటా గ్రూప్‌కు చెందిన 15 కంపెనీలు.. మొత్తం రూ.915 కోట్ల రాజకీయ విరాళాలను తమ ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా వివిధ పార్టీలకు అందించాయి. ఈ విరాళాల్లో అత్యధిక మొత్తం.. అంటే రూ.758 కోట్లు.. భారతీయ జనతా పార్టీ (BJP)కి అందాయి. BJP తర్వాత కాంగ్రెస్ పార్టీ రూ.77.3 కోట్లు అందుకుంది. మిగిలిన మొత్తం ఎనిమిది ఇతర ప్రాంతీయ, జాతీయ పార్టీలకు అందించారు.
కారణం ఇదేనా..
సాధారణంగా వ్యాపారాలకు , అభివృద్ధి ప్రణాళికలకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాలకు.. కంపెనీలు నిధులను కేటాయించడం, అభివృద్ధికి మద్దతు ఇవ్వడం అనేది ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, వ్యాపార వ్యవస్థల్లో సాధారణంగా కనిపించే ఒక వ్యూహాత్మక చర్య అని స్క్రోల్(scroll.in) తన కథనంలో పేర్కొంది. అయితే ఈ పరిణామం కేవలం టాటా గ్రూప్‌కే పరిమితం కాలేదు. సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు పొందిన మరో సంస్థ మురుగప్ప గ్రూప్ కూడా తమ యూనిట్‌కు కేంద్రం ఆమోదం తెలిపిన కొద్ది వారాల్లోనే BJPకి రూ.125 కోట్లు విరాళంగా ఇచ్చింది. ప్రభుత్వ విధానాల ద్వారా లబ్ధి పొందిన లేదా కొత్త రంగాలలోకి ప్రవేశించే కార్పొరేషన్లు.. తమ భవిష్యత్తు వ్యాపార ప్రణాళికలకు అనుకూలమైన వాతావరణాన్ని కొనసాగించడానికి ఇలా చేస్తుంటాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications