Tata News: టాటా గ్రూప్ చేతిలో చిత్తైన పాకిస్తాన్ ఎకానమీ.. అవమానభారంతో దాయాది దేశం
Pakistan News: మరోసారి టాటా గ్రూప్ చరిత్ర సృష్టించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో కొత్త శిఖరాలను అధిరోహించింది. అయితే అదే సమయంలో పొరుగు దేశం పాకిస్తాన్ కు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చింది. దీంతో అసూయపడటం తప్ప ఏమీ చేయలేక దాయాది దేశం అలా చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది.
టాటా గ్రూప్ కంపెనీల సంయుక్త మార్కెట్ విలువ పాకిస్తాన్ స్థూల దేశీయోత్పత్తి (GDP)ని అధిగమించిందని ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. సాల్ట్ నుంచి సాఫ్ట్‌వేర్ వరకు వివిధ రంగాలకు చెందిన గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో ఏడాదిగా మంచి రాబడిని ఇవ్వడాన్ని హైలైట్ చేసింది. భారీ రుణాలతో సతమతమవుతున్న పాకిస్తాన్ మొత్తం ఆర్థిక వ్యవస్థ కంటే టాటా గ్రూప్ విలువ ఇప్పుడు ఎక్కువగా ఉందని పేర్కొంది.

నివేదిక ప్రకారం.. టాటా గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 365 బిలియన్ డాలర్లు(30 లక్షల కోట్లు). అయితే IMF అంచనా వేసిన పాకిస్తాన్ GDP 341 బిలియన్ డాలర్ల కంటే ఇది ఎక్కువ. లిస్ట్ కాబడిన టాటా గ్రూప్ వ్యాపారాల్లో IT మేజర్ TCS వాటా దాదాపు 15 లక్షల కోట్లు. అంటే TCS ఒక్కటే అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో సగం పరిమాణానికి సమానం.
టాటా మోటార్స్ షేర్లు కేవలం ఏడాది వ్యవధిలో 110 శాతం పెరగ్గా, ట్రెంట్ 200 శాతం భారీగా లాభపడింది. ఇది టాటా టెక్నాలజీస్, టీఆర్‌ఎఫ్, బెనెరాస్ హోటల్స్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, టాటా మోటార్స్, ఆటోమొబైల్ కార్పొరేషన్ ఆఫ్ గోవా మరియు ఆర్ట్‌సన్ ఇంజనీరింగ్ వంటి స్టాక్‌ల ఆరోగ్యకరమైన పనితీరుకు అదనం కావడం విశేషం.


Click it and Unblock the Notifications