Demerger News: ప్రస్తుత మార్కెట్ పరిస్థితులతో పాటు కంపెనీ యాక్ట్ చట్టాలకు అనుగుణంగా టాటా గ్రూప్, అదానీ గ్రూప్ తమ వ్యాపారాలను విభజించాలని నిర్ణయించాయి. వాస్తవానికి దేశీయ స్టాక్ మార్కెట్లు బుల్ జోరులో కొనసాగుతున్న వేళ అనూహ్యంగా రెండు సంస్థలు ఏకకాలంలో ఒకటే నిర్ణయాన్ని వెల్లడించటం గమనార్హం.
ముందుగా Tata Motors నేడు తన మెుదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 74 శాతం పెరిగి రూ.5,566 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. ఇదే క్రమంలో ఆదాయం రూ.1,09,623 కోట్లకు పెరిగింది. సమీక్షా కాలంలో టాటా మోటార్స్ స్టాండ్ అలోన్ నికర లాభం రూ.2,190 కోట్లుగా ఉంది.

టాటా మోటార్స్ లిమిటెడ్ బోర్డు సభ్యులు ఆగస్టు 1న జరిగిన సమావేశంలో కంపెనీని రెండు లిస్టెడ్ కంపెనీలుగా విభజించే ప్రణాళికను ఆమోదించారు. అలాగే టాటా క్యాపిటల్‌తో టాటా మోటార్స్ ఫైనాన్స్ విలీనం కూడా జరుగుతోంది. ఇదే క్రమంలో ఈవీ పాలసీపై స్పందిస్తూ భారత ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఈవీ పాలసీ జాగ్వార్ లాండ్‌రోవర్ సంస్థలకు అనుకూలమైనది కాదని పేర్కొంది.
ఇదే సమయంలో అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ నేడు తన తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 116% పెరిగి రూ.1,454 కోట్లకు చేరుకుంది. అలాగే కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 13 శాతం పెరిగి రూ.25,472 కోట్లకు చేరుకున్నట్లు నివేదించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.22,644 కోట్లు.
వ్యాపార విభజవ నిర్ణయం..
అదానీ ఎంటర్‌ప్రైజెస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎఫ్‌ఎంసీజీ వ్యాపారాన్ని డీ-మెర్జర్ చేసే ప్లాన్‌ను ఆమోదించింది. ఈ క్రమంలో అదానీ కమోడిటీస్ LLP అదానీ విల్మార్ వ్యాపారం నుంచి వేరు చేయబడుతుంది. అదానీ కమోడిటీస్ ఎడిబుల్ ఆయిల్, ఇతర సంబంధిత వస్తువులను వ్యాపారం చేస్తుంది. ఇటీవల భారీ లాభాలను ఆర్జించిన తర్వాత అదానీ విల్మార్ ఎడిబుల్ ఆయిల్ సంబంధిత వ్యాపారంపై దృష్టి పెడుతోంది. మార్కెట్లో వంటనూనెల వ్యాపారంలో కంపెనీ మరింతగా ముందుకు సాగేందుకు నిర్ణయించటంతో కొత్త కంపెనీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications