Tata Group: టాటా గ్రూప్ అతిపెద్ద రికార్డ్.. ఇక అంబానీ ప్యాకప్.. స్టాక్ బ్రోకర్స్ BUY రేటింగ్స్..
Tata News: రతన్ టాటా నేతృత్వంలో టాటా గ్రూప్ ప్రపంచ ఖ్యాతిని పొందిన సంగతి తెలిసిందే. నిజాయితీకి నిలువుటద్ధం రతన్ టాటా. అయితే ప్రస్తుతం టాటా గ్రూప్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ వేగంగా దూసుకుపోతోంది.
వివరాల్లోకి వెళితే టాటా గ్రూప్ లోని 18 కంపెనీల సంయుక్త మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.30 లక్షల కోట్లను దాటేసింది. వాస్తవంగా దీని వెనుక ఉన్న కారణం ఇటీవల టీసీఎస్, టాటా మోటార్స్ కంపెనీ షేర్లలో నడిచిన భారీ ర్యాలీ. ఇందులో దాదాపుగా సగానికి పైన అంటే రూ.15 లక్షల కోట్లు కేవలం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ మార్కెట్ విలువ కావటం గమనార్హం. కంపెనీ ఈ భారీ విలువను అందుకోవటం తొలిసారి కావటంతో దాదాపు 23 మంది స్టాక్ మార్కెట్ నిపుణులు షేర్లకు కొనుగోలు రేటింగ్ అందించారు. యూరప్ మార్కెట్లలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఒప్పందాలు కంపెనీకి భారీగా కలిసొచ్చాయి.

అయితే ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాప్ దాదాపు రూ.21.60 లక్షల కోట్లుగా నిలిచి రెండవ స్థానానికి పరిమితమైంది. అలాగే పవర్, మౌలికసదుపాయాల రంగంలో దిగ్గజంగా కొనసాగుతున్న అదానీ గ్రూప్ మార్కెట్ విలువ రూ.15.54 లక్షల కోట్లుగా ఉండటంతో మూడవ స్థానానికి గౌతమ్ అదానీ పరిమితమయ్యారు.
మంగళవారం నాటికి టాటా మోటార్స్, టైటాన్ రెండు కంపెనీల మార్కెట్ విలువ రూ.3 లక్షల కోట్లకు పైగా ఉంది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ బలమైన ఆర్థిక సంఖ్యలను నివేదించిన తర్వాత మాజీ షేర్లు ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. బలమైన Q3 ఫలితాలకు తోడుగా.. విశ్లేషకులు టాటా మోటార్స్ JLR వ్యాపారంలో దాని నిరంతర మెరుగుదలతో పాటు టాటా మోటార్స్ తన రుణాన్ని భారీగా తగ్గించుకోవటం అద్భుతమైన ర్యాలీకి కారణమైంది. ఇదే క్రమంలో మార్జిన్ల ఒత్తిడి కారణంగా టైటాన్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.


Click it and Unblock the Notifications