ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్! పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ కార్లను సామాన్యులకు మరింత చేరువ చేసేందుకు టాటా మోటార్స్ (Tata Motors) ఫిబ్రవరి 2026 లో భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. తన ఎలక్ట్రిక్ విభాగం 'టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ' (TPEML) ద్వారా వివిధ మోడళ్లపై ఈ ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా పాత స్టాక్ (MY24, MY25) , సరికొత్త (MY26) మోడళ్లపై ఈ తగ్గింపులు వర్తిస్తాయి.

టాటా కర్వ్ ఈవీ (Curvv EV) - రూ. 3.8 లక్షల వరకు తగ్గింపు
ఈ ఫిబ్రవరిలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ టాటా ఈవీ (TATA EV) కార్లలో 'కర్వ్ ఈవీ' పై అత్యధికంగా రూ. 3.8 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో క్రియేటివ్ 45 వేరియంట్ పై MY24, MY25 మోడళ్లకు రూ. 3.3 లక్షలు, MY26 మోడళ్లకు రూ. 2.8 లక్షల తగ్గింపు ఉంది. మిగిలిన అన్ని వేరియంట్లపై గరిష్టంగా రూ. 3.8 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.
టాటా పంచ్ ఈవీ (Punch EV) - రూ. 1.6 లక్షల వరకు ఆఫర్
టాటా మోటార్స్ ఫిబ్రవరి 20వ తేదీన 'పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్' ను లాంచ్ చేయబోతున్న తరుణంలో ప్రస్తుత మోడళ్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. MY24 , MY25 మోడళ్లపై రూ. 1.6 లక్షల వరకు, సరికొత్త MY26 మోడళ్లపై రూ. 90,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
నెక్సాన్, టియాగో, హారియర్ పై ఆఫర్లు
- నెక్సాన్ ఈవీ (Nexon EV): టాటా యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన ఈ మోడల్‌పై రూ. 1.2 లక్షల వరకు డిస్కౌంట్ ఉంది. కొత్త MY26 మోడళ్లపై మాత్రం రూ. 30,000 వరకు తగ్గింపు లభిస్తుంది.
- టియాగో ఈవీ (Tiago EV): టాటా అందిస్తున్న బడ్జెట్ ఎలక్ట్రిక్ కారు టియాగోపై రూ. 1.5 లక్షల వరకు (పాత స్టాక్) తగ్గింపు ఉంది. కొత్త మోడళ్లపై రూ. 60,000 వరకు ఆఫర్ ఉంది.
- హారియర్ ఈవీ (Harrier EV): టాటా ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ కారు అయిన హారియర్ ఈవీపై యూనిఫాంగా రూ. 1.5 లక్షల డిస్కౌంట్ లభిస్తోంది. MY26 మోడళ్లలో లోయల్టీ బోనస్ పొందే ఏకైక కారు ఇదే కావడం విశేషం.
మీరు కొత్తగా ఎలక్ట్రిక్ కారు కొని పెట్రోల్, డీజిల్ ఖర్చుల నుండి విముక్తి పొందాలనుకుంటే.. ఈ ఫిబ్రవరి నెల టాటా ఈవీలను సొంతం చేసుకోవడానికి సరైన సమయం. వేరియంట్లను బట్టి ఆఫర్లు మారుతుంటాయి. కాబట్టి మీ సమీప డీలర్ ను సంప్రదించడం ఉత్తమం.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications