Tata Elxsi: 6 శాతానికి పడిపోయిన టాటా గ్రూప్ స్టాక్.. ఏడాదిలో 45 శాతం డౌన్..

ఒకప్పుడు అద్భుతంగా రాణించిన టాటా గ్రూప్ చెందిన టాటా ఈఎల్ఎక్సీ ఇప్పుడు నేల చూపులు చూస్తోంది. తాజాగా కంపెనీ జూన్ త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. దీంతో ఈ స్టాక్ ప్రైస్ బుధవారం 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయింది. టాటా ఈఎల్ఎక్సీ షేర్ ధర బుధవారం 6 శాతానికి పైగా పడిపోయి రూ.3,473.75 వద్ద ట్రేడవుతోంది. ఈ త్రైమాసికంలో టాటా ఈఎల్ఎక్సీ రూ.170 కోట్ల నరక లాభాన్ని నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే ఇది 18.2 శాతం పెరిగింది. ఎబిటా గత సంవత్సరం తో పోలిస్తే 15.7 శాతం పెరిగి రూ.216 కోట్లకు చేరింది.

అయితే ఆటోమోటివ్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు ఇంజనీరింగ్ వ్యయాలను తగ్గించడం, ఐరోపా నుంచి వచ్చే ఆదాయం గత త్రైమాసికంతో పోలిస్తే 1.9 శాతం తగ్గడం మార్జిన్లపై ప్రభావం చూపాయని టాటా ఈఎల్ఎక్సీ పేర్కొంది. దీంతో ఈ రోజు ఈ స్టాక్ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఈ కంపెనీ షేరు ఈ రోజే కాకుండా గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తుంది. ఈ కంపెనీ షేరు గత నెలలో 13 శాతం, గత మూడు నెలల్లో 22 శాతం, గత ఆరు నెలల్లో 36 శాతం పడిపోయింది. ఇక సంవత్సర కాలంలో ఏకంగా 45 శాతం వరకు తగ్గింది.

Tata Elxsi

ఫలితాలు అంచనాలు అందుకోకపోవడంతో ఏడాది కాలంగా స్టాక్ పై ఒత్తిడి కనిపిస్తోంది. ఇక నుంచి కూడా టాటా ఈఎల్ఎక్సీ షేరు ధర 16 శాతం వరకు పడిపోయే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థలు పేర్కొంటున్నాయి. ఐరోపాలో క్లయింట్ల వ్యయం ఇంకా పరిమితంగా ఉంది. దీంతో పాటు కంపెనీ EBIT మార్జిన్ 19 శాతానికి తగ్గిందని గుర్తు చేస్తున్నాయి. ఇది తాము అంచనా వేసిన దాని కంటే 21.5 శాతం కంటే చాలా తక్కువని మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది. అందుకే సెల్ రేటింగ్ ఇస్తున్నట్లు తెలిపింది. ఇటీవల కంపెనీ పెద్ద ఒప్పందాలు కూడా చేసుకోలేదని గుర్తు చేసింది.

టాటా ఎల్క్సీ, జెన్‌ఏఐ (GenAI) ఆధారిత మెటీరియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్ అయిన ViTEL, మెడ్‌టెక్, హెల్త్‌కేర్ పరిశ్రమల కోసం AI-నేటివ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్లాట్‌ఫారమ్ అయిన AnaTELను ప్రారంభించింది. ఈ షేర్ ప్రైస్ 2022 ఆగస్ట్ 12న రూ.10,238 ఉండేది. ఇప్పుడు రూ.3,473 కు పడిపోయింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+