Multibagger Stocks: లక్షను రూ.10.50 కోట్లుగా మార్చిన టాటా స్టాక్.. ఈ స్టాక్ ఉంచుకున్న వారు కోటీశ్వరులయ్యారు..

Multibagger Stocks: ప్రస్తుతం టాటా గ్రూప్ ఐటి షేర్‌లో భారీ పెరుగుతున్నాయి. అయితే ఈ సమయంలో టాటాలకు చెందిన ఒక కంపెనీ మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది. ఒకప్పుడు రూ.7.68గా ఉన్న ఈ స్టాక్ ప్రస్తుతం రూ.8,078 వద్ద ట్రేడ్ అవుతోంది. అంటే ఈ కాలంలో ఇన్వెస్టర్లు ఏకంగా కోటీశ్వరులుగా మారారు. గత 25 ఏళ్లలో ఇన్వెస్టర్లకు ఊహించని రీతిలో లక్ష శాతానికి పైగా రాబడిని ఈ స్టాక్ అందించి.

బలమైన లాభాలు..

బలమైన లాభాలు..

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది టాటాలకు చెందిన Tata Elxsi స్టాక్ గురించే. ఇది ఒక ఐటీ కంపెనీ. ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బలమైన లాభాలను నమోదు చేసింది. వ్యాపార కార్యకలాపాల ద్వారా కంపెనీ రూ.725.9 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. అన్ని టాక్సులు చెల్లించిన తరువాత రూ.184.7 కోట్ల లాభాన్ని గడించింది. కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.50,250.24 కోట్లుగా ఉంది.

Tata Elxsi షేర్ చరిత్ర..

Tata Elxsi షేర్ చరిత్ర..

భారతీయ స్టాక్ మార్కెట్‌లో గత కొన్ని సంవత్సరాలుగా అద్భుతమైన రాబడిని అందించిన మల్టీబ్యాగర్ స్టాక్‌లలో టాటా గ్రూప్ కు చెందిన Tata Elxsi ఒకటి. టాటా Elxsi షేర్ YTD ప్రాతిపధికన 36.67% రాబడిని ఇచ్చింది. ఈ కాలంలో చాలా IT స్టాక్‌లు తమ పెట్టుబడిదారులకు సున్నా రాబడిని ఇచ్చాయి. ఈ ఐటీ స్టాక్ గత ఏడాది కాలంలో 80 శాతం రాబడిని అందించగా.. గత 5 సంవత్సరాల్లో ఏకంగా 858.47 శాతం రాబడిని ఇచ్చింది.

పెన్నీ స్టాక్ గా ప్రారంభమై..

పెన్నీ స్టాక్ గా ప్రారంభమై..

25 సంవత్సరాల క్రితం జూలై 11, 1997న BSEలో ఈ షేర్ ధర రూ.7.68గా ఉంది. ఈ రోజు మార్కెట్ విలువ ప్రకారం ఈ స్టాక్ రేటు రూ. 8,078 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ స్టాక్ గత 9 ఏళ్లలో 9274.09% రాబడిని ఇచ్చింది. ఈ సమయంలో 23 ఆగస్టు 2013న.. స్టాక్ రూ.86.13 నుంచి ప్రస్తుత ధరకు పెరిగింది. 25 సంవత్సరాల క్రితం ఒక ఇన్వెస్టర్ ఈ స్టాక్ లో లక్ష రూపాయిలు పెట్టుబడి పెట్టినట్లయితే.. ప్రస్తుతం దాని విలువ రూ. 10.50 కోట్లు అయి ఉండేది. ఈ స్టాక్ లో దీర్ఘకాలం పాటు తమ పెట్టుబడులను కొనసాగించిన ఇన్వెస్టర్లకు మంచి రాబడిని పొందారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+