టాటా ఎలక్ట్రానిక్స్‌పై సైబర్ దాడి.. Apple, Teslaకు సంబంధించిన 2 లక్షల ఫైళ్లు లీక్..
టాటా గ్రూప్‌నకు చెందిన ప్రముఖ సంస్థ 'టాటా ఎలక్ట్రానిక్స్' (Tata Electronics) తమ కొన్ని కంప్యూటర్ సిస్టమ్‌లలో కొన్ని వారాల క్రితం ఒక సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘనను (డేటా లీక్) గుర్తించినట్లు సోమవారం అధికారికంగా వెల్లడించింది. ఈ భద్రతా లోపం గురించి తెలియగానే తాము తక్షణమే స్పందన ప్రోటోకాల్‌లను అమలు చేశామని, దీనివల్ల కంపెనీ వ్యాపార కార్యకలాపాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడలేదని సంస్థ స్పష్టం చేసింది.
అయితే భద్రతా పరిశోధకులు రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపిన వివరాల ప్రకారం.. 'వరల్డ్ లీక్స్' (World Leaks) అనే అంతర్జాతీయ ర్యాన్సమ్‌వేర్ హ్యాకర్ల గ్రూప్ ఈ సైబర్ దాడికి పాల్పడి, దాదాపు 630 గిగాబైట్లకు పైగా పరిమాణం ఉన్న 2 లక్షల కంటే ఎక్కువ ఫైళ్లను డార్క్ వెబ్‌లో బహిరంగంగా పోస్ట్ చేసింది. లీక్ అయిన ఈ సున్నితమైన డేటాబేస్‌లో ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ 'యాపిల్' , ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ 'టెస్లా'కు సంబంధించిన అత్యంత రహస్య డిజైన్లు, తయారీ స్పెసిఫికేషన్లు ఉన్నట్లు ఆరోపణలు వస్తుండటంతో యాపిల్ సంస్థ ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణను ప్రారంభించింది.

డార్క్ వెబ్‌లో లీక్ అయిన ఈ భారీ డేటాబేస్‌ను పరిశీలించిన భారతీయ సైబర్‌సెక్యూరిటీ పరిశోధకుడు రాజశేఖర్ రాజహరియా , మరో నిపుణుడు రాకేష్ కృష్ణన్ దీనిపై కీలక విషయాలను వెల్లడించారు. ఈ డేటా కనీసం జూన్ 10 నుంచే డార్క్ వెబ్‌లో అందుబాటులో ఉందని, అందులో కంపెనీ అంతర్గత ఇమెయిళ్లు, సుదీర్ఘ కాలపు ఈవెంట్ లాగ్‌లతో పాటు విదేశీ సిబ్బందితో సహా ఉద్యోగుల పాస్‌పోర్ట్‌ల కాపీలు కూడా ఉన్నాయని వారు తెలిపారు.
ముఖ్యంగా యాపిల్ సంస్థకు చెందిన ఫైళ్లను వెతకగా అందులో 'com.apple.factorydata' , 'material specification' వంటి రహస్య కోడ్‌లతో కూడిన 181 ఫైళ్లు, ఫోల్డర్లు బయటపడ్డాయి. అలాగే తమిళనాడులో యాపిల్ ఐఫోన్ల ప్రధాన అసెంబ్లీ ప్లాంట్ ఉన్న 'హోసూర్' ప్రాంతానికి సంబంధించిన 33 ఫైళ్లు, ఫోల్డర్లు కూడా ఈ లీక్‌లో ఉండటం గమనార్హం. ప్రస్తుతం భారతదేశంలో తయారవుతున్న మొత్తం యాపిల్ ఐఫోన్‌లలో మూడింట ఒక వంతు (1/3rd) భాగం టాటా ఎలక్ట్రానిక్స్ ద్వారానే ఉత్పత్తి అవుతుండగా, మిగిలిన భాగాన్ని ఫాక్స్‌కాన్ సంస్థ తయారు చేస్తోంది. ఈ డేటా ఉల్లంఘన తీవ్రతను బట్టి గత వారమే టాటా సంస్థ తన ఐఫోన్ అసెంబ్లీ విభాగంలోని కొంతమంది ఉద్యోగులను అప్రమత్తం చేసినట్లు సమాచారం.
యాపిల్‌తో పాటు ప్రముఖ ఈవీ దిగ్గజం టెస్లాకు సంబంధించిన విడిభాగాలను కూడా టాటా తయారు చేస్తున్న నేపథ్యంలో, ఆ సంస్థకు చెందిన కొన్ని అత్యంత రహస్య పత్రాలు కూడా ఈ లీక్‌లో బయటపడ్డాయి. డేటాబేస్‌లో లభించిన "NV36 ఛార్జ్‌పోర్ట్ కంట్రోలర్ - నార్త్ అమెరికా" అనే ఫోల్డర్‌లో టెస్లా మోడల్ Y (Model Y) యొక్క అప్‌గ్రేడ్ వెర్షన్‌కు సంబంధించిన సరికొత్త విడిభాగాల వివరాలు ఉన్నట్లు గుర్తించారు. దీనితో పాటు టెస్లాకు చెందిన 2023 నాటి మరొక పత్రానికి "ట్రేడ్ సీక్రెట్" (Trade Secret) అని పేరు పెట్టబడి ఉందని, అందులో కంపెనీకి చెందిన అత్యంత ప్రతిష్టాత్మక 'ప్రజెక్ట్ హైలాండ్' (Project Highland) కు సంబంధించిన కొన్ని రహస్య డ్రాయింగ్‌లు కూడా బయటపడ్డాయని పరిశోధకులు స్పష్టం చేశారు.
ఈ ఫైళ్లలో యాపిల్, టెస్లా సంస్థలకు చెందిన యాజమాన్య , వాణిజ్య రహస్యాలు ఉన్నట్లు స్పష్టమవుతున్నప్పటికీ, రాయిటర్స్ సంస్థ ఈ ఫైళ్ల ప్రామాణికతను స్వతంత్రంగా తక్షణమే ధృవీకరించలేకపోయింది. ఈ సైబర్ ఉల్లంఘన , విమోచన క్రయధనం (Ransom) డిమాండ్‌లపై అటు టాటా ఎలక్ట్రానిక్స్ కానీ, ఇటు యాపిల్ సంస్థ కానీ అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయడానికి నిరాకరించాయి.


Click it and Unblock the Notifications
