Zudio: చాలా కాలంగా మార్కెట్లో బడ్జెట్ ఫ్లెండ్లీ ఫ్యాషన్ దుస్తుల విక్రయంలో టాటాలకు చెందిన జూడియో దూసుకుపోతోంది. ఇది ముఖేష్-ఇషా అంబానీల నేతృత్వంలోని రిలయన్స్ ట్రెండ్స్ బ్రాండ్ కు పెద్ద పోటీదారుగా అవతరించింది. అయితే కంపెనీ సక్సెస్ ఫార్ములా దేశంలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ప్రస్తుతం జూడియో పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు భారీ వ్యాపారం, ఆదాయాన్ని టార్గెట్ సేకరిస్తోంది. యువతను ఎప్పటికప్పుడు కొత్త ఫ్యాషన్ ట్రెండ్లతో ఆకట్టుకుంటోంది. ఈ విజయాన్ని అనుసరించి కంపెనీ గురుగ్రామ్‌లో 22,000 చదరపు అడుగుల రిటైల్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. మార్చిలో తూర్పు దిల్లీలో Zudio తన 506వ స్టోర్‌ను ప్రారంభించింది. రిటైల్ దుస్తులు రంగంలో డిమాండ్ మందగించినప్పటికీ 2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో అనూహ్యంగా బలమైన రాబడి వృద్ధిని జూడియో అంచనా వేసింనట్లు బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ నివేదిక ప్రకారం వెల్లడైంది.

విశ్లేషకుల అంచనాల్లో తెలిసిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. జూడియో విజయం వెనుక అసలు రహస్యం దాని ఇన్వెంటరీని రోజుల వ్యవధిలో అప్‌డేట్ చేయగల సామర్థ్యం, ఇది మార్కెట్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రత్యేకమైన శక్తి.జూడియోను నిర్వహించే దుస్తులు రిటైలర్ టాటా ట్రెండ్‌ను దాని స్థిరమైన కాంపౌండర్స్ పోర్ట్‌ఫోలియోకు జోడించింది. దీనికి తోడు జూడియో బ్రాండ్ బలం దాని లాజిస్టిక్స్, ఉత్పత్తి అభివృద్ధిపై పూర్తి నియంత్రణ కలిగి ఉండటమే. అందుకే ప్రతి నెలా కొత్త దుస్తులను పరిచయం చేసి కస్టమర్లను నిలబెట్టుకోగలుగుతోంది.
అదేవిధంగా తక్కువ ధరలకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడం ద్వారా అదనపు వాణిజ్యాన్ని పొందడం ద్వారా దాని ఇన్వెంటరీని 6 రెట్లు పెంచుతుంది. టాటా గ్రూప్ తన WESTSIDE బ్రాండ్ ద్వారా ఈ రంగంలో విస్తారమైన అనుభవాన్ని సంపాదించుకుంది. జూడియో బ్రాండ్ ప్రతి 15 రోజులకు వారి దుస్తులను పునరుద్ధరించుకుంటుంది. పరిశ్రమలో మరే ఇతర దుస్తులు కంపెనీ తమ ఇన్వెంటరీని ఇంత వేగంగా మార్చలేదు. తద్వారా వారు తమ పోటీదారుల కంటే 3-5 రెట్లు వేగంగా ఎదుగుతున్నారు. జూడియో ప్రస్తుతం టాటా ట్రెండ్స్ కింద నిర్వహించబడుతోంది. రానున్న కాలంలో టైటాన్ ఫార్ములాలో కంపెనీ వృద్ధి చెందితే 2000 రెట్లు లాభాలను అందించగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. టాటా ట్రెండ్ షేర్లు నేడు 0.84 శాతం క్షీణించి రూ.3,899 వద్ద ఉన్నాయి. అయితే 2024లోనే 29.88 శాతం వృద్ధి చెందాయి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్‌లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications