పడిపోయిన టాటా కన్సల్టెన్సీ లాభాలు.. పెరిగిన ఆదాయం.. ఒక్కో షేరుకు డివిడెంట్ ప్రకటన..
TCS Q4 Result: భారతదేశపు సాఫ్ట్‌వేర్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మార్చి 2025తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను ఈరోజు గురువారం విడుదల చేసింది. టాటా గ్రూప్ దిగ్గజ కంపెనీ TCS నెట్ ప్రాఫిట్ మార్చి త్రైమాసికంలో వార్షిక (YoY) ప్రాతిపదికన పడిపోయింది. జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో టీసీఎస్ నికర లాభం 1.7% తగ్గి రూ.12,224 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.12,434 కోట్లుగా ఉంది. అయితే ఈ మొత్తం అంచనా వేసిన రూ.12,650 కోట్ల కంటే కొంచెం తక్కువ.

అయితే రేపు శుక్రవారం కంపెనీ షేర్లు ఫోకస్'లో ఉండవచ్చని అంచనా. మహావీర్ జయంతి సందర్భంగా ఇవాళ గురువారం స్టాక్ మార్కెట్ మూసివేయబడింది. కానీ బుధవారం TCS షేర్లు దాదాపు 2% తగ్గి రూ.3,239 వద్ద ముగిశాయి. నిన్న బుధవారం ఏప్రిల్ 9న బిఎస్‌ఇలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ షేర్లు రూ.3246.10 వద్ద ముగిశాయి. ఏప్రిల్ 10న అంటే ఇవాళ మహావీర్ జయంతి సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు. అయితే 2025 సంవత్సరంలో ఇప్పటివరకు టిసిఎస్ స్టాక్ 21 శాతం క్షీణత చూసింది.
రెవెన్యూ పెరుగుదల: TCS ఆదాయం 5.3% పెరిగి రూ.64,479 కోట్లకు చేరుకుంది, గత ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.61,237 కోట్లుగా ఉంది. ఈ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఖర్చులు రూ.49,105 కోట్లు కాగా, మార్చి 2024 త్రైమాసికంలో ఖర్చులు రూ.45,545 కోట్లుగా ఉన్నాయి. దీనితో పాటు కంపెనీ ఒక్కో షేరుకు రూ.30 ఫైనల్ డివిడెండ్‌ను కూడా ప్రకటించింది. ఈ విషయాన్ని అన్యువల్ బోర్డు సమావేశంలో ఆమోదం పొందాల్సి ఉంటుంది. డిసెంబర్ 2024 త్రైమాసిక ఫలితాల ప్రకటనతో పాటు టిసిఎస్ ఒక్కో షేరుకు రూ.10 మధ్యంతర డివిడెండ్ అలాగే ఒక్కో షేరుకు రూ.66 ప్రత్యేక డివిడెండ్ ప్రకటించింది. దీనికి రికార్డు తేదీని జనవరి 17గా నిర్ణయించారు. నాల్గవ త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ మార్జిన్ 24.2%, నెట్ మార్జిన్ 19.0%గా నివేదించింది. ఈ త్రైమాసికంలో TCS రికార్డు స్థాయిలో $12.2 బిలియన్ల టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ (TCV)ను నమోదు చేసింది, బుక్-టు-బిల్ రేషియో 1.6 అని తెలిపింది.
కంపెనీ ఏం చెప్పిందంటే : కంపెనీ CEO అండ్ ఎండి కే. కృతివాసన్ మాట్లాడుతూ వార్షిక ఆదాయంలో $30 బిలియన్లను అధిగమించడం ఇంకా వరుసగా రెండవ త్రైమాసికంలో కూడా బలమైన ఆర్డర్ బుక్ సాధించడం పట్ల మేము సంతోషిస్తున్నాము అని అన్నారు.


Click it and Unblock the Notifications