Tata Communications Stock: దేశీయ స్టాక్ మార్కెట్లలో రెండవ త్రైమాసిక పేలవ పనితీరు స్టాక్ మార్కెట్లు భారీగా ప్రభావితం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు మరిన్ని అంతర్జాతీయ కారణాలతో స్టాక్ మార్కెట్లలో కల్లోలం కొనసాగుతోంది. అయితే ఇలాంటి సందర్భంలోనూ టాటా గ్రూప్ కంపెనీ ఒకటి భారీగా లాభపడుతూ తన ఇన్వెస్టర్లకు లాభాలను కుమ్మరిస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీ అయిన టాటా కమ్యూనికేషన్స్ కంపెనీ షేర్ల గురించే. ప్రపంచ వ్యాప్తంగా ఏఐ సాంకేతికత వినియోగం పెరుగుతోంది. అయితే ఇండియాలో భారీగా డిజిటల్ ఎకో సిస్టమ్ వృద్ధి చెందుతున్న వేళ దీనిలో ఏఐ టూల్స్ మిళితం చేయాలని ప్రభుత్వ ప్రైవేటు సంస్థల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు ముంబైలో ఎన్వీడియా ఏఐ సమ్మిట్ 2024 నిర్వహించబడింది. ఈ సమయంలో అమెరికా చిప్ మేకర్ భారతీయ సంస్థలతో భాగస్వామ్యాలను కుదుర్చుకున్న విషయాన్ని ప్రకటించింది.

ఈ క్రమంలో ప్రముఖ చిప్ తయారీ సంస్థ భారతీయ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ కంపెనీతోనూ ఒప్పందం కుదిరినట్లు ప్రకటించింది. దీంతో ఇంట్రాడేలో టాటా కమ్యూనికేషన్స్ షేర్లు ఫోకస్‌లో కొనసాగాయి. కంపెనీ షేర్లు ఈరోజు 4% వరకు పెరుగుదలను చూశాయి. దీంతో ఇంట్రాడేలో స్టాక్ ధర ఒక్కోటి రూ.1840.90కి చేరుకోగా చివరికి ఎన్ఎస్ఈలో రూ.1790.65 దగ్గర స్థిరపడ్డాయి. వాస్తవానికి నేడు కంపెనీ షేర్లు పెరగటానికి కారణం దేశంలో తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అప్‌గ్రేడ్ చేసిన తర్వాత స్టాక్‌పై కొనుగోలు ఆసక్తి పెరిగింది. AI క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అధునాతన వెర్షన్ ఎన్వీడియా భాగస్వామ్యంతో జరుగుతోంది. కంపెనీ ఫైలింగ్స్ ప్రకారం.. ఎన్వీడియా NIM మైక్రోసర్వీసెస్, ఎన్వీడియా Omniverse, ఎన్వీడియా Isaac ప్లాట్‌ఫారమ్‌ల వంటి అత్యాధునిక సాఫ్ట్‌వేర్ సొల్యూషన్‌లను టాటా సంస్థ AI క్లౌడ్ సమర్పణలలో ఏకీకృతం చేస్తున్నట్లు వెల్లడించింది.
అలాగే టాటా కమ్యూనికేషన్స్ తన అప్‌గ్రేడ్ మొదటి దశను ఈ ఏడాది చివర్లో ప్రారంభించనుంది. ఇది దేశంలోని అతిపెద్ద ఎన్వీడియా హాపర్ GPU క్లౌడ్-ఆధారిత సూపర్ కంప్యూటర్‌లలో ఒకటిగా కూడా ఇన్‌స్టాల్ చేయబడుతుంది. అలాగే రెండవ దశ పనులు 2025లో ప్రారంభం కానున్నాయి. అలాగే గడచిన నెలరోజుల్లో టాటా కమ్యూనికేషన్స్ షేర్లు 12 శాతం క్షీణించాయి. నేడు మార్కెట్ల ముగింపు సమయంలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.51,030 కోట్లుగా ఉంది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం సంవత్సరానికి 2.98 శాతం పెరిగి రూ.227.23 కోట్లుగా నమోదైంది.
ఎన్వీడియాతో అంబానీ డీల్..
అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెరికా దిగ్గజ చిప్ మేకర్ ఎన్వీడియాతో చేసుకున్న డీల్ గురించే. భారతదేశంలో డిజిటలీకరణ వేగంగా ముందుకు సాగుతున్న వేళ ఏఐ సాంకేతికత చాలా కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రిలయన్స్ ఎన్వీడియా కలిసి దేశంలో ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మించటానికి భాగస్వామ్యం కలిగి ఉన్నాయని ఎన్వీడియా సీఈవో జెన్సన్ హువాంగ్ ప్రకటించారు. ప్రస్తుతం ఏఐ అభివృద్ధిలో అతిపెద్ద చిప్ తయారీదారుల్లో ఒకటిగా ఉన్న ఎన్వీడియా కీలక ఆటగాడిగా మారిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications