Tata IPO: టాటా గ్రూప్ లోని టాటా క్యాపిటల్ దేశంలో అతిపెద్ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. ఇది ప్రజల నుంచి ఎలాంటి డిపాజిట్లను అంగీకరించదు. ఇది కొన్ని అనుబంధ సంస్థల్లో పెట్టుబడులను కలిగి ఉంది.
ఇటీవల రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన NBFC అప్పర్-లేయర్ వర్గీకరణ కింద టాటాలకు చెందిన టాటా క్యాపిటల్, టాటా సన్స్ లిమిటెడ్ ఉన్నాయి. అయితే ఈ కంపెనీలు సెప్టెంబర్ 2025 నాటికి తమ ఐపీవోలను మార్కెట్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. ఇప్పటికే అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో ఫైనాన్షియల్స్ వ్యాపార ఐపీవోను తీసుకొచ్చిన తరుణంలో టాటాలు సైతం తమ ఫైనాన్స్ విభాగాన్ని ఐపీవోగా తెస్తారని చాలా మంది భావిస్తున్నారు.

మరోపక్క టాటా గ్రూప్ తన టాటా క్యాపిటల్ లిమిటెడ్ కార్యకలాపాలను పునర్నించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా స్టాక్ మార్కెట్లలోకి అరంగేట్రం చేయటంతో పాటు కంపెనీ బోర్డును మరింతగా విస్తరించాలని ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడైంది. ఇందులో భాగంగా టాటా క్యాపిటల్ కింద కొన్ని గ్రూప్ సంస్థల విలీనాలు జరుగుతున్నాయని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. రిజర్వు బ్యాంక్ తాజా వర్గీకరణ ప్రకారం మూడేళ్లలో టాటా క్యాపిటల్ తో పాటు పేరెంట్ కంపెనీ టాటా సన్స్ మూడేళ్లలోపు పబ్లిక్‌గా మార్చాలని కోరింది.
ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం ఎన్‌బీఎఫ్‌సీ-అప్పర్ లేయర్ వర్తించే సంస్థలు.. మెరుగైన రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను స్వీకరించడానికి బోర్డు-ఆమోదిత విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను నోటిఫై చేసిన తర్వాత మూడేళ్లలోపు తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనిపై టాటా క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ సబర్వాల్ స్పందిస్తూ తాము రిజర్వు బ్యాంక్ మార్గదర్శకాలను పాటిస్తామని స్పష్టం చేశారు. 2018లో L&FS సంస్థ పతనం తర్వాత సెంట్రల్ బ్యాంక్ దేశంలోని NBFCల నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌ను కఠినతరం చేయటంలో భాగంగా తాజా చర్యలు వచ్చాయి.


Click it and Unblock the Notifications