Blue Star: దేశీయ స్టాక్ మార్కెట్లలో టాటాలకు చెందిన అనేక కంపెనీలు లిస్ట్ అయ్యి ఉన్నాయి. అయితే ఇవి క్యూ2లో మంది ఫలితాలను నమోదు చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే టాటాలకు చెందిన బ్లూ స్టార్ కంపెనీ తన సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. బలమైన లాభాలతో మంగళవారం కంపెనీ షేర్లు 9 శాతానికి పైగా లాభపడ్డాయి. జూలై-సెప్టెంబర్ మధ్య కాలానికి కంపెనీ రూ.1,890 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.1,582 కోట్ల కంటే దాదాపు 19.5 శాతం అధికం.

కంపెనీ ఆదాయంలో ఎక్కువ భాగం ఎలక్ట్రో మెకానికల్ ప్రాజెక్ట్స్, కమర్షియల్ ఎయిర్ కండిషనింగ్ సెగ్మెంట్ నుంచి వచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. బ్లూ స్టార్ ఈ విభాగం ద్వారా ఏకంగా రూ.1,077 ఆదాయాన్ని ఆర్జించింది. కంపెనీ మొత్తం ఆదాయంలో ఇది 55 శాతానికి సమానమైనదిగా ఉంది. గత ఏడాది ఇదే విభాగం నుంచి కంపెనీ రూ.961.22 కోట్లను ఆదాయాన్ని ఆర్జించింది.
త్రైమాసిక ఫలితాలు విడుదలైన తర్వాత నేడు BSEలో బ్లూ స్టార్ షేర్లు రూ.903.90 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. అయితే ఇంట్రాడేలో కొద్దిసేపటికే షేర్ ధర గరిష్ఠంగా రూ.954 కోట్లకు చేరుకుంది. ఇది షేర్ 52 వారాల గరిష్ఠ ధర కావటం గమనార్హం. అలాగే గడచిన ఏడాది కాలంలో స్టాక్ మార్కెట్‌లో బ్లూ స్టార్ పనితీరు అద్భుతంగా కొనసాగుతోంది.
ఏడాది క్రితం ఈ స్టాక్‌ను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు ఇప్పటివరకు 48 శాతానికి పైగా లాభాలను అందుకున్నారు. అలాగే 6 నెలల క్రితం బ్లూ స్టార్ షేర్లను కొనుగోలు చేసి హోల్డ్ చేస్తున్న పెట్టుబడిదారులు 25 శాతం కంటే ఎక్కువ రాబడిని పొందారు.


Click it and Unblock the Notifications